యూబర్ డ్రైవర్‌కు ప్యాసింజర్‌కు మధ్య మాటామాటా పెరిగి ప్యాసింజర్ ముక్కుపై గుద్దాడు. పక్కనే ఉన్న వాళ్లు ఆపడంతో అతని అక్కడితో వదలిపెట్టి వెళ్లిపోయాడు. కానీ, ఆ ప్రయాణికుడు మాత్రం సమయానికి గమ్యానికి చేరుకోలేక రక్తం కారుతున్న ముక్కుతో చికిత్స తీసుకుంటున్నాడు. 23ఏళ్ల వయస్సున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనీక్ రాయ్ నివాసముంటున్న హూడీ ప్రాంతం నుంచి కెంపెగౌడ ఎయిర్‍పోర్టుకు క్యాబ్ బుక్ చేసుకున్నాడు.
కోల్‌కతాలోని ఇంటికి దసరాకు వెళ్లేందుకు టిక్కెట్ బుక్ చేసుకున్న అనీక్‌కు యూబర్ డ్రైవర్ హరీశ్ కేఎస్ షాక్ ఇచ్చాడు. రైడ్ పూర్తి కాకముందే తనకు డబ్బులు ఇవ్వాలని కోరాడు. దానికి నిరాకరించిన అనీక్ తాను షేర్ రైడ్ బుక్ చేసుకున్నానని తాను మొత్తం అమౌంట్ ఇవ్వనని చెప్పాడు. యూబర్ డ్రైవర్ హరీశ్ షేరింగ్ రైడ్ కుదరదని క్యాన్సిల్ చేసుకోమని చెప్పాడు.
క్యాన్సిల్ చేసుకుంటే ఎక్స్ ట్రా పేమెంట్ కట్టాల్సి వస్తుందని దానికి నో చెప్పాడు రాయ్. కోపంతో హరీశ్ కారులో పెట్టిన లగేజ్‌ను కిందకి నెట్టేశాడు. వాదన పెరిగింది. డ్రైవర్‌పై కంప్లైంట్ ఇస్తానని ఫోన్ తీసి యూబర్ యాప్ ఓపెనర్ చేశాడు అనీక్. అప్పటికే కంట్రోల్ తప్పిన డ్రైవర్ పిడికిలితో హరీశ్ ముక్కుపై ఒక్క గుద్దు గుద్దాడు.
ముక్కు పగిలి రక్తం కారుతున్న రాయ్‌ను చూసి స్థానికులు వాదన ఆపేందుకు ప్రయత్నించారు. క్యాబ్ డ్రైవర్‌ను పంపేశారు. తనపై జరిగిన దాడిని పోలీసులకు వివరించాడు రాయ్. మరో క్యాబ్ పట్టుకుని ఎయిర్‌పోర్టుకు చేరుకున్నప్పటికీ రక్తం కారుతున్న ముక్కుతో ఉన్న వ్యక్తిని విమానం ఎక్కేందుకు సిబ్బంది అనుమతించలేదు.
రెండో రోజు టిక్కెట్ బుక్ చేసుకుని గమ్యానికి చేరుకున్నాడు అనీక్ రాయ్. డ్రైవర్‌పై పలు సెక్షన్ల ప్రకారం.. కేసు ఫైల్ చేసుకుని పోలీసులు అరెస్టు చేశారు.