Uddhav thackeray: శివసేనలో మళ్లీ చీలిక..? మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’

శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే(Uddhav thackeray) అత్యవసరంగా తన ఎంపీల సమావేశాన్ని నిర్వహించారు.

Uddhav thackeray holds crucial meeting with all nine shiv sena ubt mps

  • ఉద్ధవ్‌తో 9 మంది ఎంపీల భేటీ
  • శివసేన చీలిక ప్రచారానికి చెక్
  • షిండే చేరికలపై కొనసాగుతున్న ఊహాగానాలు

Uddhav thackeray: మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి శివసేనలో చీలిక ఊహాగానాలు జోరందుకున్నాయి. కొందరు ఎంపీలు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరబోతున్నారనే ప్రచారం మధ్య, పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే(Uddhav thackeray) అత్యవసరంగా తన ఎంపీల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీకి చెందిన మొత్తం తొమ్మిది మంది లోక్‌సభ సభ్యులు హాజరయ్యారని శివసేన (యూబీటీ) స్పష్టం చేసింది. దీంతో పార్టీ ఎంపీలు విడిపోతారనే ప్రచారానికి చెక్‌ పెట్టే ప్రయత్నం చేసింది.

Bungee Jump Tragedy: బంజీ జంపింగ్‌ అంటూ అమ్మాయిని తోసేశారు.. తాడు కట్టడం మర్చిపోయారు.. ఘోరం జరిగిపోయిందిగా

ముంబైలోని మాతోశ్రీ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి నలుగురు ఎంపీలు ప్రత్యక్షంగా హాజరుకాగా, మరో ఐదుగురు ఆన్‌లైన్‌ ద్వారా పాల్గొన్నారు. అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్ తదితరులు సమావేశానికి ప్రత్యక్షంగా హాజరయ్యారు. మిగిలిన ఎంపీలు తమ వ్యక్తిగత, రాజకీయ కారణాలను ఉద్ధవ్‌ ఠాక్రేకు వివరించి వర్చువల్‌గా సమావేశంలో పాల్గొన్నట్లు పార్టీ నేతలు తెలిపారు. దీంతో తొమ్మిది మంది ఎంపీలు ఒకే వేదికపై ఉన్నారనే సందేశాన్ని పార్టీ ఇవ్వాలని భావించింది.

ఇటీవల కొందరు శివసేన (యూబీటీ) ఎంపీలు ఏక్‌నాథ్‌ షిండే లేదా ఆయన వర్గానికి చెందిన నేతలతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఇద్దరు మూడొంతుల మెజారిటీతో ఆరుగురు ఎంపీలు పార్టీ మారే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. అయితే ఉద్ధవ్‌ ఠాక్రే సమావేశం ద్వారా పార్టీ ఐక్యతను ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. మరోవైపు ఎంపీల భవిష్యత్‌ రాజకీయ అడుగులపై ఊహాగానాలు కొనసాగుతుండగా, మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.