బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తు కోసం బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. “కాంగ్రెస్ పెంచి పోషిస్తున్న బాలీవుడ్ మాఫియా ఒత్తిడిలో ఉద్ధవ్ థాకరే ఉన్నారని ఆయన ఆరోపించారు. అందువల్ల సుశాంత్ సింగ్ కేసులో బాధ్యులైన అన్ని అంశాల నుంచి వారిని కాపాడటానికి ఉద్ధవ్ థాకరే మొగ్గు చూపుతున్నారని సుశీల్ మోడీ ట్వీట్ చేశారు.
महाराष्ट्र में पहले भी बिहार के लोगों से दुर्व्यवहार की शिकायतें मिलती थीं, लेकिन अब वहां कांग्रेस-एनसीपी की बैसाखी पर टिकी उद्धव सरकार ने तो हद कर दी है।
लॉकडाउन के दौरान महाराष्ट्र से बिहारी मजदूरों की वापसी के समय अड़ंगेबाजी की गई।— Sushil Kumar Modi (@SushilModi) August 1, 2020
బీహార్ ప్రజలకు కాంగ్రెస్ ఏమి చూపిస్తుంది? ఇప్పుడు బీహార్ బిడ్డ అయిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై దర్యాప్తు చేయడానికి వచ్చిన బీహార్ పోలీసులకు ముంబై పోలీసుల మద్దతు లభించడం లేదని ఆయన విమర్శించారు.
उदीयमान अभिनेता सुशांत सिंह राजपूत की कथित आत्महत्या ने करोड़ों बिहारवासियों को स्तब्ध और दुखी किया है, इसलिए लगभग सभी दल चाहते हैं कि मामले की सीबीआई जांच हो।
— Sushil Kumar Modi (@SushilModi) August 1, 2020
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కోట్లాది బిహారీలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నేపధ్యంలో అన్ని పార్టీలు ఈ విషయంపై సీబీఐ విచారణను కోరుతున్నాయి. సుశాంత్‌కు న్యాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకైనా వెళ్తుందని సుశీల్ మోడీ వ్యాఖ్యానించారు.