Udhayanidhi Stalin : ఉదయనిధి స్టాలిన్ తలపై రూ.10కోట్ల బహుమతి…అయోధ్య అర్చకుడి సంచలన ప్రకటన

సనాతన ధర్మంపై తమిళనాడు క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రాజుకుంటూనే ఉంది. ఉదయనిధి స్టాలిన్ తలపై రూ.10కోట్ల బహుమతిని అయోధ్య అర్చకుడు ప్రకటించడం సంచలనం రేపింది....

Udhayanidhi on seers

Udhayanidhi Stalin : సనాతన ధర్మంపై తమిళనాడు క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రాజుకుంటూనే ఉంది. ఉదయనిధి స్టాలిన్ తలపై రూ.10కోట్ల బహుమతిని అయోధ్య అర్చకుడు ప్రకటించడం సంచలనం రేపింది. ఉదయనిధి స్టాలిన్ తల నరికి తన వద్దకు తీసుకువస్తే రూ.10కోట్ల నగదు బహుమతి ఇస్తానని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని తపస్విచావిని ఆలయ ప్రధాన అర్చకుడు పరమహంస ఆచార్య ప్రకటించారు. ఉదయనిధిని(Udhayanidhi Stalin) చంపడానికి ఎవరూ సాహసించక పోతే తానే అతన్ని కనుగొని చంపేస్తానని పరమహంస ఆచార్య చెప్పారు.

Mamata Banerjee: ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్‌పై కుండబద్దలు కొట్టినట్లు అభిప్రాయాన్ని చెప్పిన మమత 

ఆచార్య తన తలపై రివార్డు ప్రకటించడంపై ఉదయనిధి స్పందించారు. (Rs 10 crore bounty for his head) బెదిరింపులు తమకు కొత్త కాదని, ఈ బెదిరింపులకు భయపడే వాళ్లం కాదని ఉదయనిధి చెప్పారు. తమిళ భాష కోసం రైలు ట్రాక్ పై తల పెట్టిన కరుణానిధి మనవడినని ఆయన పేర్కొన్నారు. తన తల దువ్వు కోవడానికి 10 రూపాయల దువ్వెన చాలని ఆచార్య బెదిరింపును ఉదయనిధి తేలికగా చెప్పారు. సిమెంట్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్న పారిశ్రామికవేత్త దాల్మియాస్ కుటుంబం పేరు మార్చడాన్ని నిరసిస్తూ కరుణానిధి నేతృత్వంలోని డిఎంకె కార్యకర్తలు ట్రాక్‌లపై పడుకుని తమ నిరసనను తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు