Mamata Banerjee: ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్‌పై కుండబద్దలు కొట్టినట్లు అభిప్రాయాన్ని చెప్పిన మమత 

ప్రతి మతానికీ ప్రత్యేకమైన నమ్మకాలు, భావాలు ఉంటాయని తెలిపారు. అలాగే, తాను మాత్రం..

Mamata Banerjee: ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్‌పై కుండబద్దలు కొట్టినట్లు అభిప్రాయాన్ని చెప్పిన మమత 

Mamata Banerjee - Udhayanidhi Stalin

Mamata Banerjee – Udhayanidhi Stalin: సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. తాను సనాతన ధర్మాన్ని గౌరవిస్తానని చెప్పారు.

ఇవాళ మమతా బెనర్జీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…  ప్రతి మతానికీ ప్రత్యేకమైన నమ్మకాలు, భావాలు ఉంటాయని తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతీయ లక్షణమన్నారు. ఏదైనా ఓ వర్గం వారిని బాధించేలా ఉండే ఏ విషయంలోనూ తలదూర్చకూడదని చెప్పారు. తాను సనాతన ధర్మాన్ని గౌరవిస్తానని, అందులోనే రుగ్వేదం, అధర్వణ వేదం ఉంటాయని తెలిపారు.

తన ప్రభుత్వం నుంచి చాలా మంది పూజారులు పెన్షన్ పొందుతున్నారని చెప్పారు. వారు మత సంబంధ వేడుకలను నిర్వహిస్తారని అన్నారు. ప్రజలు ఏ వర్గానికి చెందినవారైనా సరే వారిని బాధించేలా కామెంట్లు చేయకూడదని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నానని చెప్పారు.

Udhayanidhi Stalin: మళ్లీ మళ్లీ అంటూనే ఉంటాను: ఉదయనిధి స్టాలిన్