MGR statue
Saffron Shawl On MGR Statue : తమిళనాడులో అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ విగ్రహంపై గుర్తు తెలియని వ్యక్తులు కాషాయ శాలువా వేయడం తీవ్ర కలలం రేపుతోంది. మదురైలోని మద్రాసు హైకోర్టు బెంచ్ సమీపంలో ఉన్న ఎంజీఆర్ విగ్రహంపై గుర్తు తెలియని వ్యక్తులు కాషాయ శాలువా వేశారు.
మంగళవారం దీన్ని గమినించిన అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో నిరసనలు చేపట్టారు. అలాగే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంజీఆర్ విగ్రహంపై కాషాయ శాలువా కప్పిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
‘Madras Eye’: తమిళనాడులో ప్రబలుతున్న ‘మద్రాస్ ఐ’.. అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచనలు
సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఎంజీఆర్ విగ్రహం దగ్గరకు చేరుకుని, ఆ విగ్రహంపై వేసిన కాషాయ శాలువాను తొలగించారు. ఎంజీఆర్ విగ్రహంపై శాలువా ఎవరు వేశారన్న విషయంపై దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
రాష్ట్రంలో గతంలో కూడా ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. తిరువల్లువర్, అన్నా, పెరియార్, అంబేద్కర్ విగ్రహాలపై కాషాయ కండవాలు వేడయంతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా ఎంజీఆర్ విగ్రహంపై కాషాయ శాలువా వేయడం తీవ్ర దుమారం రేపుతోంది.