Union Budget 2027-28: 2027-28 కేంద్ర బడ్జెట్ కసరత్తు షురూ.. వాటిపైనే స్పెషల్ ఫోకస్.. ఆర్థిక మంత్రిత్వ శాఖ బిగ్ అప్‌డేట్!

కేంద్ర ప్రభుత్వం రాబోయే ఆర్థిక సంవత్సరానికి (Union Budget 2027-28)సంబంధించిన బడ్జెట్ తయారీ ప్రక్రియను వేగవంతం చేసింది.

Union budget 2027 28 pre budget meetings from october 12 finance ministry

  • బడ్జెట్ తయారీ ప్రక్రియ షురూ
  • ఉద్యోగాలు, ఆర్థిక వృద్ధి ప్రోత్సాహం
  • నిర్మలమ్మ వరుసగా 10వ బడ్జెట్

Union Budget 2027-28: కేంద్ర ప్రభుత్వం రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ తయారీ ప్రక్రియను వేగవంతం చేసింది. 2027-28 కేంద్ర బడ్జెట్ కసరత్తును అక్టోబర్ 12 నుంచి అధికారికంగా ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు, ధరల పెరుగుదల సవాళ్ల మధ్య దేశీయ వృద్ధిని నిలబెట్టుకోవడం, ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించడం, అంతర్గత డిమాండ్‌ను పెంచడం లక్ష్యంగా ఈసారి సంస్కరణలను మరింత వేగవంతం చేసే అవకాశం కనిపిస్తోంది.

Mahesh Kumar Goud: పార్టీలో విభేదాలు నిజమే.. పదవుల కోసం తీవ్ర పోటీ.. టీపీసీసీ చీఫ్ హాట్ కామెంట్స్

మంత్రిత్వ శాఖల వ్యయ ప్రాధాన్యతలు – కీలక గడువులు:

ఆర్థిక మంత్రిత్వ శాఖ(Union Budget 2027-28) విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం, వ్యయ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో వివిధ శాఖలతో ప్రీ-బడ్జెట్ సమావేశాలు నవంబర్ మధ్య వరకు కొనసాగుతాయి. ఆయా మంత్రిత్వ శాఖలు తమ ఆర్థిక అవసరాలను అక్టోబర్ 6, 2026 నాటికే యూనియన్ బడ్జెట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (UBIS)లో నమోదు చేయాల్సి ఉంటుంది. డిసెంబర్ చివరి నాటికి తుది వ్యయ పరిమితులను ఖరారు చేసి, పన్నుల ద్వారా వచ్చే రాబడి అంచనాలను ఆధారంగా చేసుకుని బడ్జెట్ నివేదికను ఆమోదిస్తారు.

నిర్మలా సీతారామన్‌కు అరుదైన మైలురాయి:

మోడీ 3.0 ప్రభుత్వంలో ఇది నాలుగో బడ్జెట్ కాగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ప్రవేశపెడుతున్న 10వ బడ్జెట్ కావడం విశేషం. భారత రాజకీయాల్లో ఒక ఆర్థిక మంత్రి వరుసగా 10 బడ్జెట్లను సమర్పించడం అత్యంత అరుదైన ఘనతగా నిలవనుంది. వృద్ధిని పరుగులు తీస్తూనే, పేదరిక నిర్మూలన, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు.