Minister Kaushal Kishore: తాగుబోతులకు పిల్లనివ్వకండి.. నా కొడుకులా ఎవ్వరూ చేయొద్దన్న కేంద్ర మంత్రి
కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ ఆడపిల్లల తల్లిదండ్రులకు ఓ విజ్ఞప్తి చేశారు. తాగుబోతులకు మీఇంటి ఆడ పిల్లలను ఇచ్చి పెళ్లిచేయొద్దని అన్నారు. అలా ఎందుకు అనాల్సి వచ్చిందో కారణాన్ని కూడా మంత్రి వివరించారు.
- Harishth Thanniru
- Published On : December 25, 2022 / 09:24 PM IST
Union minister Kaushal Kishore
Minister Kaushal Kishore: కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ ఆడ పిల్లల తల్లిదండ్రులకు కీలక సూచన చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తాగుబోతులకు మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లిచేయకండి అంటూ విజ్ఞప్తి చేశారు. మద్యం తాగేవాడికన్నా ఓ రిక్షా తొక్కుకునే వ్యక్తి , కూలీ చేసుకొని జీవనంసాగించే వ్యక్తికి ఇచ్చి పెళ్లిచేసినా మంచి అల్లుడవుతాడు అంటూ కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి ఇలా ఎందుకు అనాల్సి వస్తుందో కారణాన్ని కూడా వివరించారు.
BJP MP : బీజేపీ ఎంపీ కోడలు ఆత్మహత్యాయత్నం
తన కుమారుడు మద్యానికి బానిసై భార్య, ఓ కొడుకును అనాథలను చేశాడని చెబుతూ బాధను వ్యక్తం చేశాడు. నేను ఎంపీ, నా భార్య ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు మా కుమారుడు ఆకాష్ కిషోర్ మద్యానికి బానిసగా మారాడని, చెడు స్నేహం వాడిని మద్యానికి బానిసను చేసిందని మంత్రి తెలిపారు. డి – అడిక్షన్ సెంటర్‌లో చేర్పించాం. చెడు అలవాటు మానేస్తానని చెప్పి ఆరు నెలలకే పెళ్లి చేసుకున్నాడని అన్నారు. కానీ మద్యానికి మరింతగా బానిసై రెండేళ్ల క్రితం చనిపోయాడని తెలిపారు.
Nepal PM Prachanda: మూడోసారి నేపాల్ పీఎంగా ప్రచండ .. సోమవారం ప్రమాణ స్వీకారం..
నా కొడుకు చనిపోయినప్పుడు అతని కుమారుడికి రెండేళ్లు. కట్టుకున్న భార్య, కుమారుడు ఇప్పుడు అనాథలుగా మారారు. నిత్యం వారితోపాటు మేమూ క్షోభను అనుభవిస్తున్నామని కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్ తీవ్ర బాధను వ్యక్తం చేశారు. ఆడపిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని, తాగుబోతులకు మీఇంటి ఆడపిల్లలను ఇచ్చి వారి గొంతుకోయద్దంటూ సూచించారు.
