Nepal PM Prachanda: మూడోసారి నేపాల్ పీఎంగా ప్రచండ .. సోమవారం ప్రమాణ స్వీకారం..

నేపాల్ ప్రధానిగా పుష్ప కమల్ దహల్ (ప్రచండ) సోమవారం సాయంత్రం 4గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే రెండు సార్లు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన మూడోసారి ప్రధానిగా రేపు బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే.. గతంలో రెండు సార్లు ప్రధానిగా చేసినప్పటికీ పూర్తిస్థాయిలో ఆ పదవిలో ప్రచండ కొనసాగలేదు. ఈ సారికూడా రెండున్నరేళ్ల ఒప్పందం మేరకు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

Nepal PM Prachanda: మూడోసారి నేపాల్ పీఎంగా ప్రచండ .. సోమవారం ప్రమాణ స్వీకారం..

Nepal PM

Nepal PM Prachanda: నేపాల్  రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. ఇటీవల జరిగిన సార్వత్రి ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవటంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పార్టీ మధ్య పొత్తులు కుదరలేదు. పీఎం పీఠంకోసం పలు పార్టీలు పట్టుబట్టడంతో ఆ దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఆదివారం ఆ సంక్షోభానికి తెరపడింది. ఆరు రాజకీయ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడి సీపీఎన్- మావోయిస్టు సెంట్రల్ చైర్మన్ పుష్ప కమల్ దహల్ (ప్రచండ) ను ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకున్నారు. అయితే ప్రచండ కేవలం రెండున్నరేళ్లు మాత్రమే పీఎంగా బాధ్యతలు చేపడతారు. ఆ తరువాత మరో పార్టీ నేత పీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు.

Nepal New PM: నేపాల్‌లో రాజకీయ సంక్షోభానికి తెర.. నూతన ప్రధానిగా ప్రచండ.. రెండున్నరేళ్లు మాత్రమే

ఆరు పార్టీల మధ్య ఒప్పందం జరిగిన తరువాత ప్రచండ ఆదివారం సాయంత్రం నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారి వద్దకు వెళ్లారు. 169 మంది ఎంపీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతిఇవ్వాలని కోరారు. కొద్దిసేపటికే రాష్ట్రపతి ప్రచండ ప్రధానిగా ప్రమాణ స్వీకారానికి ఆమోదం తెలిపింది. దీంతో సోమవారం సాయంత్రం 4గంటలకు ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

పుష్ప కమల్ దహల్ (ప్రచండ) 1954 డిసెంబర్ 11న పోఖారా సమీపంలోని కస్కీ జిల్లా ధికుర్ పోఖారీలో జన్మించారు. సీపీఎన్ – మావోయిస్టు లో దశాబ్ద కాలంపాటు సాగిన సాయుధ తిరుగుబాటు మార్గాన్ని వీడి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అయితే పుష్ప కమల్ దహల్ రెండు సార్లు నేపాల్ ప్రధానిగా పనిచేశారు. 2008 ఎన్నికల్లో సీపీఎన్ – మావోయిస్టు పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ సమయంలో ప్రచండ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల 2009 మే 4 ప్రధాని పదవికి రాజీనామా చేశారు. తిరిగి 2016- 2017 సంవత్సరాల్లో ప్రధానిగా పనిచేశారు. సోమవారం మూడోసారి ఆయన నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే ఆయన పూర్తికాలం ప్రధానిగా బాధ్యతలు నిర్వహించ లేకపోయారు. ఈసారికూడా రెండున్నరేళ్లు మాత్రమే ప్రధానిగా ఒప్పందం మేరకు సోమవారం ప్రచండ ప్రమాణ స్వీకారం చేస్తారు.