Union Home Minister Amit Shah
Union Home Minister Amit Shah: చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ల బిల్లు (Women Reservation Bill) కు బుధవారం లోక్ సభ (Lok Sabha) ఆమోదం తెలిపింది. దాదాపు ఎనిమిది గంటలపాటు జరిగిన చర్చ అనంతరం పార్లమెంట్ లో ఈ బిల్లుపై ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ లో 454 మంది సభ్యులు మహిళా బిల్లుకు ఆమోదం తెలుపుతూ ఓటింగ్ వేయగా.. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఆ పార్టీ ఔరంగాబాద్ ఎంపీ సయ్యద్ ఇంతియాజ్ జలీల్ వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ బిల్లుపై గురువారం రాజ్యసభ చర్చ జరగనుంది. ఇక్కడ ఆమోదం పొందితే లోక్‌సభతో పాటు అసెంబ్లీలో ఈ బిల్లువల్ల 33శాతం కోటా మహిళలకు దక్కనుంది.
Read Also : Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం
అయితే, ఈ బిల్లుపై తొలుత ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని లోక్ సభ వేదికగా నిలదీశాయి. 2024 ఎన్నికల సమయం నుంచే మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశాయి. డీలిమిటేషన్ కు ముందే రిజర్వేషన్లను అమలు చేయనప్పుడు, ప్రత్యేక సమావేశాలు ఎందుకు అంటూ నిలదీశాయి. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. 2024 ఎన్నికలు కాగానే జన గణన, డీలిమిటేషన్ ను తదుపరి ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు. అవి పూర్తికాగానే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని చెప్పారు. గతంలో నాలుగు సార్లు మహిళలను ఈ పార్లమెంట్ నిరాశ పర్చిందని, కానీ ఈసారి అలాంటి పరిస్థితి ఉండదని అమిత్ షా చెప్పారు.
Read Also : Women Reservation Bill: మహిళా రిజర్వేషన్లకే ఇన్నేళ్లు పడితే.. అధికారం రావడానికి ఎన్నేళ్లు పడుతుందో?
మహిళా రిజర్వేషన్లు 2029 తరువాత అమల్లోకి వస్తాయని అమిత్ షా చెప్పారు. బిల్లు అమల్లో సాంకేతిక సమస్యలు రాకుండా చూసేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవటం జరుగుతుందని తెలిపారు. డీలిమిటేషన్ కమిషన్ లేకుండా వెంటనే మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం సాధ్యం కాదని చెప్పారు. ఈ బిల్లులో మహిళలకు సమాంతరంగా హారిజంటల్, వర్టికల్ రిజర్వేషన్లు ఉన్నట్లు చెప్పారు.