Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రదాన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటో తెలుసా? ఏం చదివారు? ఆయనకు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి?

Dharmendra Pradhan : కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రదాన్ రాజకీయ నేపథ్యం ఏమిటి? ఆయన ఆస్తులు విలువ ఎంత.. ఆయన ఏం చదువుకున్నారనే విషయాలను తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.

Dharmendra Pradhan

Dharmendra Pradhan : నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ వేడిని పెంచుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ పార్టీ, విద్యార్థులు, ప్రతిపక్ష పార్టీల ఆందోళనల మధ్య ఢిల్లీలోని ప్రధాన వీధులు దద్దరిల్లుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రదాన్ రాజకీయ నేపథ్యం ఏమిటి? ఆయన ఆస్తులు విలువ ఎంత.. ఆయన ఏం చదువుకున్నారనే విషయాలను తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.

Also Read : Telangana Govt : తెలంగాణకు శుభవార్త చెప్పిన కేంద్ర సర్కార్.. అదనపు ధాన్యం కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్

ధర్మేంద్ర ప్రదాన్ 1969 జూన్ 26న ఒడిశాలోని తాల్చేర్ లో జన్మించారు. ఆయన తండ్రి దేవేంద్ర ప్రదాన్ కూడా బీజేపీ సీనియర్ నాయకుడు. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అయితే ధర్మేంద్ర ప్రదాన్ విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ వచ్చారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఆయన ఒడిశాలోని తలచర్ కళాశాలలో ఆంత్రోపాలజీలో (Anthropology) పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంఏ) పూర్తి చేశారు. ఏబీవీపీ నుంచి ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రయాణం బీజేపీ యువమోర్చాతోపాటు పార్టీ సంస్థాగత బాధ్యతల వరకు సాగింది. 2004లో తొలిసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు. ఎన్నికల నిర్వహణ, పార్టీ విస్తరణ వ్యూహాల్లో ఆయనకు మంచి అనుభవం ఉంది. పలు రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల బాధ్యతలు నిర్వహించిన ఆయన.. పార్టీ అధిష్ఠానం దృష్టిలో నమ్మకమైన నాయకుడిగా ఎదిగారు.

2014లో నరేంద్ర మోదీ కేబినెట్ లో ధర్మేంద్ర ప్రదాన్ పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రిగా పనిచేశారు. 2021లో ఆయనకు కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు అప్పగించారు. ఇటీవల నీట్‌ పరీక్షలో పేపర్‌ లీక్‌ ఆరోపణలు తెరపైకి రావడం ధర్మేంద్ర ప్రదాన్‌కు అతిపెద్ద రాజకీయ సవాల్‌గా మారింది. పరీక్ష నిర్వహణలో లోపాలకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ధర్మేంద్ర ప్రధాన్‌ ఆస్తి విలువ?
2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అతని కుటుంబం మొత్తం చరస్థిర ఆస్తుల విలువ సుమారుగా రూ.6.92 కోట్లు. ఇందులో రూ.4.61 కోట్ల చరాస్తులు, రూ.2.30 కోట్ల స్థిరస్తులు ఉన్నాయి. అఫిడవిట్ ప్రకారం.. ధర్మేంద్ర ప్రధాన్ పేరుపై చరాస్తులలో బ్యాంకు డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్‌లు, జీవిత బీమా పాలసీలు, ఆభరణాలు ఉన్నాయి. ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్‌లు, జీవిత బీమా పాలసీలలో పెట్టుబడులు పెట్టారు. వారికి వాహనాలు, కుటుంబానికి చెందిన బంగారం, వెండి ఆభరణాలు కూడా ఉన్నాయి.

ధర్మేంద్ర ప్రధాన్ కు స్థిరాస్తులలో నివాస, నివాసేతర భూములు, ఆస్తులు ఉన్నాయి. వ్యవసాయ భూమి విలువ మొత్తం రూ.1.35కోట్లు కాగా.. నివాస భవనాలు విలువ రూ.95లక్షలకుపైగా విలువైనవి. ఆయన మొత్తం ఆస్తుల విలువ సుమారుగా రూ.6.92 కోట్లుగా పేర్కొనగా, ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో సుమారు రూ. 53.37లక్షల అప్పులు కూడా ఉన్నట్లుగా పేర్కొన్నారు. అతని భార్య మృదుల ఠాకూర్ ప్రదాన్ రూ.2.95కోట్ల చరాస్తులు, రూ.1.37కోట్ల స్థిరాస్తులను కలిగి ఉన్నారు.

ధర్మేంద్ర ప్రధాన్ యొక్క స్థిరాస్తులలో నివాస, నివాసేతర భూములు, ఆస్తులు ఉన్నాయి. వీటిలో ఒడిశాలోని భువనేశ్వర్, ఇతర ప్రాంతాలలో ఆయనకు, ఆయన కుటుంబానికి చెందిన భూములు, ఇళ్లు కూడా ఉన్నాయి. ఆయన మొత్తం ఆస్తుల విలువ సుమారుగా రూ.6.92 కోట్లుగా పేర్కొనగా, ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో సుమారు రూ. 53.37లక్షల అప్పులు కూడా ఉన్నట్లుగా పేర్కొన్నారు.