TG Paddy Procurement : తెలంగాణకు శుభవార్త చెప్పిన కేంద్ర సర్కార్.. అదనపు ధాన్యం కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్
TG Paddy Procurement : తెలంగాణలో అదనంగా 8లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు కేంద్రం ఆమోదం తెలిపింది.
Centre Approved Paddy Procurement Of Additional 8 Lakh Metric Tonnes in Telangana
- తెలంగాణకు శుభవార్త చెప్పిన కేంద్ర సర్కార్
- అదనపు ధాన్యం కొనుగోళ్లకు గ్రీన్‌సిగ్నల్
- 8లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లకు ఆమోదం
TG Paddy Procurement : తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో అదనంగా ధాన్యం కొనుగోళ్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రబీకి సంబంధించి ఇప్పటికే 35లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లకు అనుమతి ఉండగా.. అదనంగా 8లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో రైతులకు పెద్ద ఊరట లభించనుంది. సవరించిన అంచనాల ప్రకారం సేకరణ మొత్తం 35లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 43లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోళ్లకు నిర్ణయించింది.
తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణలో రైతులు పండించిన ధాన్యానికి మరింత మార్కెట్ భరోసా లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. అయితే, కేంద్రం నిర్ణయం పట్ల తెలంగాణ బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లు పెంచినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా వాహనాల స్థాన నిర్ధారణ వ్యవస్థ (Vehicle Location Tracking System – VLTS) అమలుపై కూడా కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. 2026 సెప్టెంబర్ 2030 నాటికి రాష్ట్రంలోని అన్ని అర్హత గల వాహనాల్లో వీఎల్టీఎస్ వ్యవస్థను పూర్తిగా అమలు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ వ్యవస్థ ద్వారా వాహనాల కదలికలను రియల్ టైమ్‌లో పర్యవేక్షించే అవకాశం ఉండటంతో భద్రతా ప్రమాణాలు మరింత మెరుగుపడనున్నాయి.
