Video Goes Viral: ‘బేటీ బచావో, బేటీ పఢావో’ నినాదాన్ని తప్పుగా రాసిన కేంద్ర మంత్రి

స్కూల్ చలో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఈ ఘటన చోటుచేసుకుంది.

కేంద్ర మంత్రి సావిత్రి ఠాకూర్‌ అక్షర దోషాలతో ‘బేటీ బచావో, బేటీ పఢావో’ అనే నినాదాన్ని రాసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హిందీలో ఆమె వైట్‌బోర్డ్‌పై ‘బేటీ బచావో, బేటీ పఢావో’ అని రాయబోయి.. “బెడ్డీ పఢావో బచావో” అని రాసుకొచ్చారు.

మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో బుధవారం స్కూల్ చలో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఈ ఘటన చోటుచేసుకుంది. ‘బేటీ బచావో, బేటీ పఢావో’ వంటి నినాదాన్ని ఆమె తప్పుగా రాయడంతో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. సావిత్రి ఠాకూర్‌ మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా బాధ్యతల్లో ఉన్నారు.

సొంత శాఖ ముందుకు తీసుకెళ్లాల్సిన కార్యక్రమం గురించి కనీసం ఆమెకు తప్పు లేకుండా రాయడం రాదా అంటూ విపక్షాలు నిలదీస్తున్నాయి. సావిత్రి ఠాకూర్ ఎంత చదువుకున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. సావిత్రి ఠాకూర్ కు ఉన్న అక్షర జ్ఞానం మన ప్రజాస్వామ్య దురదృష్టం అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మిశ్రా విమర్శించారు.

ఎన్నికల ముందు సావిత్రి ఠాకూర్ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. ఆమె 12వ తరగతి వరకు చదువుకున్నారు. కాగా, 2015లో ప్రధాని నరేంద్ర మోదీ ‘బేటీ బచావో బేటీ పఢావో’ను పిల్లల లింగ నిష్పత్తి, మహిళా విద్య సమస్యలను అధిగమించడానికి తీసుకొచ్చారు.

Also Read: పవర్ స్టార్ టు పొలిటికల్ స్టార్.. ఏపీ రాజకీయాలను తనవైపు తిప్పుకున్న పవన్ కల్యాణ్

ట్రెండింగ్ వార్తలు