Nirmala Sitharaman: పన్ను కాదు, సెస్ అసలే కాదు.. 96 శాతం లావాదేవీలు ఉచితమే.. క్లారిటీ ఇచ్చిన నిర్మల సీతారామన్!

యూపీఐ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం పన్నులు, సెస్సులు విధిస్తోందంటూ వస్తున్న వార్తలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)క్లారిటీ ఇచ్చారు.

Union minister nirmala sitharaman clarifies on upi charges and mdr rules

Nirmala Sitharaman: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం కొత్తగా పన్నులు, సెస్సులు విధిస్తోందంటూ నెట్టింట వస్తున్న వార్తలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) అత్యంత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ తరహా పుకార్లను నమ్మవద్దని, సామాన్యుల డిజిటల్ చెల్లింపులపై ఎలాంటి అదనపు రుసుముల భారం పడబోదని ఆమె తేల్చి చెప్పారు. డిజిటల్ ఇండియాను మరింత బలోపేతం చేసే దిశగా పర్సన్-టు-పర్సన్ (P2P) లావాదేవీలన్నీ మునుపటిలాగే రూపాయి ఖర్చు లేకుండా పూర్తి ఉచితంగానే కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వంపై బురద జల్లేందుకు, ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pawan Kalyan: కమిటీ పనితీరు అస్సలు బాలేదు.. ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెడతా.. పిఠాపురంలో పవన్ సంచలన వ్యాఖ్యలు!

96 శాతం లావాదేవీలపై రూపాయి భారం ఉండదు:

ఎన్పీసీఐ మార్గదర్శకాల ప్రకారం రూ. 2,000 దాటిన పర్సన్-టు-మార్చంట్ (P2M) చెల్లింపులపై ఉండే 0.4 శాతం ఎండీఆర్ అనేది పన్ను లేదా సెస్సు కాదని ఆర్థిక మంత్రి వివరించారు. ఈ రుసుము ప్రభుత్వ ఖజానాకు చేరదని, కేవలం బ్యాంకులు, పేమెంట్ యాప్ నిర్వాహకుల మధ్య మౌలిక సదుపాయాల భద్రత కోసం జరిగే అంతర్గత సర్దుబాటు మాత్రమేనని చెప్పారు. చిన్న వ్యాపారులు, సాధారణ వినియోగదారులు జరిపే దాదాపు 96 శాతం లావాదేవీలపై దీని ప్రభావం అసలే ఉండదని వెల్లడించారు. ఈ అంశంపై ఇప్పటికే పార్లమెంట్ సాక్షిగా పూర్తిస్థాయి వివరణ ఇచ్చామని గుర్తుచేశారు.

రాజ్యాంగ పదవులపై హేళన తగదు.. రాహుల్‌పై ఫైర్:

ఇదే సమయంలో ఇండోర్‌లో రాహుల్ గాంధీ నిర్వహించిన ‘ఛాత్రోం కీ గూంజ్’ వేదికగా రాజ్యాంగబద్ధమైన పదవులను ఉద్దేశించి చేసిన మిమిక్రీ ప్రదర్శనపై నిర్మలా సీతారామన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత హోదాలో ఉండి ఇటువంటి చౌకబారు చర్యలను రాహుల్ ప్రోత్సహించడం ప్రజాస్వామ్యానికే అవమానకరమని దుయ్యబట్టారు. భావప్రకటన స్వేచ్ఛకు హద్దులు ఉంటాయని, రాజ్యాంగ హోదాల పట్ల ప్రతిపక్షాలు కనీస గౌరవాన్ని కాపాడాలని ఈ సందర్భంగా మంత్రి హితవు పలికారు.