Pet Dog
Pet Dog License: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.. పెంపుడు కుక్కలు ఉన్న యజమానులందరికీ ఈ సూచన తప్పనిసరి చేసింది. పెంపుడు కుక్కలకు లైసెన్స్ ఉండాలని లేదంటే వారు రూ.5వేల జరిమానా చెల్లించాల్సిందేనని పేర్కొంది. ఒకవేళ అలా చేయనిపక్షంలో జరిమానాతో పాటు మునిసిపల్ అథారిటీలు ఆ కుక్కను ను సీజ్ చేయాలని ఆదేశించింది.
ఈ మేరకు జూన్ 1నుంచి డోర్ టూ డోర్ సర్వే నిర్వహించనున్నారు. ఎనిమిది లక్నో మునిసిపల్ కార్పొరేషన్ టీంలు ఇందులో పాల్గొంటుండగా ఒక్కో టీంలో నలుగురు ఉండి డోర్ టూ డోర్ సర్వే నిర్వహించి జరిమానా విధిస్తారు. గతేడాది నమోదైన ఎల్ఎమ్సీ రికార్డుల ప్రకారం.. 2వేల 500 పెంపుడు కుక్కలు మాత్రమే రిజిష్టర్ చేశారని తెలిసింది.
ఎల్‌ఎంసి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డా.అరవింద్ రావు మాట్లాడుతూ.. ఈ టీంలు లైసెన్స్ లేని పెంపుడు కుక్కలను స్వాధీనం చేసుకుని, యజమానులకు రూ.5వేలు జరిమానా చెల్లించిన తర్వాత మాత్రమే విడిచిపెడతారు. జరిమానా చెల్లించడంలో యజమాని విఫలమైతే, పెంపుడు జంతువును ఇందిరా నగర్‌లోని ఎల్‌ఎంసి డాగ్ షెల్టర్ హోమ్‌కు పంపుతామని వివరించారు.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో ప్రారంభమైన మూడో దశ పోలింగ్
“ప్రతి పెంపుడు జంతువు మలం తీయడానికి. దానిని పారవేయడానికి ఒక బ్యాగ్‌ని తీసుకెళ్లాలి. చాలా మంది నియమాన్ని విస్మరిస్తున్నారు. కుక్కలు తమ ఇళ్ల వెలుపల మలవిసర్జన చేస్తున్నాయని పెంపుడు జంతువుల నుంచి ప్రతిరోజూ ఫిర్యాదులు అందుతున్నాయి” అని డాక్టర్ రావు తెలిపారు.
పెంపుడు కుక్కల సర్వే పూర్తయిన తర్వాత, పట్టణ ప్రాంతాల్లో వీధికుక్కలను చుట్టుముట్టాలని LMC యోచిస్తోంది. వీధికుక్కలు పిల్లలపై దాడి చేయడం వల్ల కొన్నిసార్లు మరణాలకు కూడా దారితీసిన పరిస్థితులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.