×
Ad

Snake Skin Mystery : యూపీలో మహిళ అదృశ్యం.. మంచం మీద ఐదు అడుగుల పాము చర్మం.. ట్విస్టులమీద ట్విస్టులు.. అసలేం జరిగిందంటే?

Snake Skin Mystery : యూపీలో వింత ఘటన చోలు చేసుకుంది.. ఓ మహిళ పాముగా మారిందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు..

Snake Skin Mystery

Snake Skin Mystery : యూపీలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ గ్రామంలో యువతి తన గదిలో పొడుకుంది. ఆ తరువాత ఆమె ఆదృశ్యమైంది. అయితే, కుటుంబ సభ్యులు చూడగా.. ఆమె నిద్రించిన మంచంపై ఆమె దుస్తుల్లో  ఐదు అడుగుల పాము చర్మం కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. యువతి పాముగా మారిందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పోలీసులు రంగంలోకిదిగి విచారణ చేపట్టారు. యువతి ఎటు వెళ్లిపోయిందన్న కోణంలో విచారణ చేస్తున్నారు. అయితే, ఆ యువతి పాముగా మారిందన్న స్థానికుల వాదనలో ఎలాంటి నిజం లేదని పోలీసులు చెబుతున్నప్పటికీ.. ప్రస్తుతం ఘటన యూపీలో సంచలనంగా మారింది.

Also Read : Yogi Adityanath: బాబ్రీ మసీద్ పునర్‌ నిర్మాణంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఔరయ్య జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఉదయం ఆ మహిళ తన గది నుంచి బయటకు రాకపోయే సరికి.. కుటుంబ సభ్యులు ఆమె గదికి వెళ్లి చూశారు. మహిళ కనిపించకపోగా.. ఆమె నిద్రించే మంచంపై ఐదుగు అడుగుల పాము చర్మం కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. విషయం స్థానికులకు తెలియడంతో వారంతా ఘటన స్థలి వద్దకు వెళ్లి చూసి ఆశ్యర్యం వ్యక్తం చేశారు. కొందరు ఆమె పాముగా మారిందని చెబుతున్నారు. అయితే, గతంలో ఈ ప్రాంతంలో అప్పుడప్పుడూ పాములు కనిపించాయని కుటుంబ సభ్యులు చెప్పారు.

మేము చాలా బాధలో ఉన్నాం. మా కుమార్తె సురక్షితంగా తిరిగి రావాలని కోరుకుంటున్నామని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న అజిత్మల్ సర్కిల్ ఆఫీసర్ మనోజ్ గంగ్వార్ నేతృత్వంలోని స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. తండ్రి ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ సెక్షన్ 87 కింద కేసు నమోదు చేశారు. అదృశ్యమైన మహిళ ఆచూకీ కోసం అనేక బృందాలను ఏర్పాటు చేశామని గంగ్వార్ తెలిపారు. అయితే, మహిళ పాముగా మారిందన్న వార్తలు కేవలం పుకర్లేనని.. అలాంటివి నమ్మొద్దని పోలీసులు స్పష్టం చేశారు.

మహిళ పాముగా మారిందని వస్తున్న వార్తలు పూర్తిగా పుకార్లు. వాటిని ఎవరూ నమ్మొద్దు. పాము చర్మం, బట్టలు ఉండటం దర్యాప్తును తప్పుదారి పట్టించడానికి లేదా దృష్టి మరల్చడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నం కావొచ్చునని అజిత్మల్ సర్కిల్ ఆఫీసర్ మనోజ్ గంగ్వార్ అన్నారు. మహిళ ఇంటి నుంచి పోలీసులు మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు.

అయితే, అదృశ్యమైన మహిళ అదేగ్రామానికి చెందిన యువకుడితో సంబంధం కలిగి ఉందని, ఆమె అదృశ్యం కావాలని ముందుగానే పథకం ప్రకారం ఇలా చేసిందని పోలీసులు భావిస్తున్నారు. పాము చర్మాన్ని తన దుస్తుల్లో చుట్టి.. తన మంచంపై ఉంచిందని.. గ్రామస్తులను పాముగా మారిందని నమ్మించేలా ఇలా చేసి.. ఆమె తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయిందన్న వాదన పోలీసు వర్గాల నుంచి వినిపిస్తోంది. అయితే, ఈమేరకు పోలీసులు పూర్తి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.