మాట్లాడితేనే..సొల్యుషన్ దొరుకుతుంది : ఉపాసన

  • Publish Date - November 21, 2019 / 10:28 AM IST

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిరుచులను, హెల్త్ టిప్స్‌ను పంచుకొనే కొణిదెల వారి కోడలు, అపోలో లైఫ్ సంస్థ అధినేత ఉపాసన  మహిళలకు సంబంధించిన ఓ  కీలక విషయంపై స్పందించారు. తన అభిప్రాయాలను..సూచనలను సూటిగా చెప్పారు.  మహిళలు రుతుస్రావం విషయంలో తన తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. 

మహిళలకు ప్రకృతిపరంగా నెలసరి వస్తుంటుంది. కానీ వీటి గురించి మహిళలు బహిరంగంగా మాట్లాడరు. ఆ సమయంలో వచ్చే అనారోగ్య సమస్యల గురించి పైకి చెప్పుకోరు. అలా చెప్పుకోవాలంటే లేడీ డాక్టర్ దగ్గర మాత్రమే చెబుతారు. అదికూడా సిగ్గు పడుతూ..చెప్పకూడదని విషయం చెబుతున్నట్లుగా రహస్యంగా గొంతు తగ్గించి చెబుతుంటారు. 

ఈ విషయంపై ఉపాసన మాట్లాడుతూ..మహిళలకు పీరియడ్స్ సర్వసాధారణమైన అంశమనీ..పీరియడ్స్ ఆరోగ్యానికి, మహిళల గర్భధారణకు ఉపయోగపడేదని ఆమె వ్యాఖ్యానించారు.  కొందరు మహిళలు  రుతుక్రమం గురించి మాట్లాడేందుకు ఎందుకు భయపడుతారో అర్థం కాదన్నారు.  దాన్ని సీక్రెట్‌గా దాచేందుకు ప్రయత్నిస్తారు. కొందరు ఇదంతా ఏదో చెడు అన్నట్లు భావిస్తారు. మలబద్ధకం, గ్యాస్ గురించి బహిరంగంగా మాట్లాడుతున్నపుడు పీరియడ్స్ గురించి మాట్లాడటానికి ఎందుకు భయం’ ఎందుకు సిగ్గు అని ప్రశ్నించారు. పీరియడ్స్ గురించి మాట్లాడగలిగితేనే దానికి తగ్గ సొల్యుషన్ దొరుకుతుందని మహిళలకు ఉపాసన సూచించారు.