Donald Trump: బ్రిటన్ ప్రధాని స్టార్మర్ రాజీనామా.. సంచలనంగా మారిన డొనాల్డ్ ట్రంప్ పోస్ట్
బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ త్వరలోనే తన పదవికి రాజీనామా చేయబోతున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సంచలన ప్రకటన చేశారు.
- V Santhosh Kumar
- Published on- June 21, 2026 / 10:23 PM IST
US President Donald Trump sensational announcement that British Prime Minister Keir Starmer going to resign from his post soon.
- కీర్ స్టార్మర్ రాజీనామా చేస్తారు.
- ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్.
- వలసలు ఇంధన పాలసీల్లో వైఫల్యం.
Donald Trump: బ్రిటన్ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతూ, ఆ దేశ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ త్వరలోనే తన పదవికి రాజీనామా చేయబోతున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మర్ త్వరలోనే తప్పుకోనున్నారని, ఆయన భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
Donald Trump: చర్చలు విఫలమైతే మళ్ళీ దాడులు.. ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని వైఫల్యాలను ట్రంప్ (Donald Trump)తీవ్రంగా విమర్శించారు. కీర్ స్టార్మర్ దేశానికి సంబంధించిన రెండు అత్యంత ముఖ్యమైన అంశాలలో దారుణంగా విఫలమయ్యారని ఆయన దుయ్యబట్టారు. అందులో మొదటిది ‘వలసల నియంత్రణ’ కాగా, రెండోది ‘ఇంధన విధానం’ అని ట్రంప్ స్పష్టం చేశారు. ముఖ్యంగా నార్త్ సీ ఆయిల్ (ఉత్తర సముద్ర చమురు ఉత్పత్తి) రంగాన్ని తెరవడంలో స్టార్మర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ఎద్దేవా చేశారు.
ప్రస్తుతం బ్రిటన్‌లో అంతర్గత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న తరుణంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లేబర్ పార్టీలోనే స్టార్మర్ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని, ఆయనపై రాజీనామా చేయాలంటూ సొంత పార్టీ నుంచే ఒత్తిడి పెరుగుతోందని నివేదికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకముందే.. ట్రంప్ ముందస్తుగా ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం విశేషం.
