decides-to-promote-all-govt-school-students-without-exams
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయం నెలకొంది. కరోనా వైరస్ గజగజ వణికిస్తోంది. మన దేశంలోనే చాప కింద నీరులా కరోనా వేగంగా వ్యాపిస్తోంది. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయం నెలకొంది. కరోనా వైరస్ గజగజ వణికిస్తోంది. మన దేశంలోనే చాప కింద నీరులా కరోనా వేగంగా వ్యాపిస్తోంది. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు, చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు ప్రభుత్వాలు సెలవులు ఇచ్చాయి. కొన్ని రాష్ట్రాల్లో మార్చి 31వ తేదీ వరకు సెలవులు ఇచ్చాయి. కొన్ని రాష్ట్రాల్లో ఏప్రిల్ 2వ తేదీ వరకు విద్యా సంస్థలు మూసేశారు.(ఇంట్లో కూర్చుని పుస్తకాలు చదవండి : ఆలియా భట్)
విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా యోగి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్షలు రాయకుండానే పైతరగతులకు పంపాలని నిర్ణయించింది. అయితే ఈ వెసులుబాలు ప్రభుత్వ స్కూల్స్ లో చదివే 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే వర్తించనుంది. వార్షిక పరీక్షలు నిర్వహించకుండానే పాస్ చేస్తామని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ వెల్లడించింది. ఎలాంటి ఆటంకం లేకుండా విద్యార్థులందరినీ పైతరగతులకు ప్రమోట్ చేస్తామని స్పష్టం చేసింది.
యూపీలో ప్రైమరీ పాఠశాలలకు మార్చి 23 నుంచి 28 వరకు వార్షిక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆ పరీక్షలను రద్దు చేశారు. ఏప్రిల్ 2 వరకు విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మరికొన్ని రోజులు కరోనా వైరస్ తీవ్రత ఉంటుందని భావిస్తున్న అధికారులు, పరీక్షలు రాయకుండానే పాస్ చేయాలని నిర్ణయించారు.
విద్యా సంస్థలతో పాటు సినిమా థియేటర్లు, మల్టిప్లెక్స్ లు, పర్యాటక ప్రదేశాలను ఏప్రిల్ 2వ తేదీ వరకు మూసేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వీలైనంత వరకు ఉద్యోగులకు వర్క్ ప్రమ్ హోమ్ అవకాశం కల్పించాలని కంపెనీల యాజమాన్యాలకు ప్రభుత్వం సూచించింది.