Cow Treatment
Uttar Pradesh: తాను సంరక్షకుడిగా ఉన్న ఆవుకు ట్రీట్మెంట్ కోసం ఆరుగురు గవర్నమెంట్ వెటర్నరీ డాక్టర్లను పురమాయించాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లోని చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ (సీవో) జిల్లా మేజిస్ట్రేట్ అపూర్వ దూబే ఆవుకు చికిత్స కోసం ఈ ఘటన జరిగింది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన కథనం ప్రకారం.. చీఫ్ వెటర్నరీ ఆఫీసర్.. వారానికొకరు చొప్పున వెటర్నరీ డాక్టర్ ను అపాయింట్ చేసినట్లు తెలుస్తోంది.
డాక్టర్లు రోజుకు రెండు సార్లు ఆవును పరీక్షించి.. ప్రతి రోజు సాయంత్రం ఆరుగంటలలోపే సీవీఓ కార్యాలయానికి రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించారు. దాంతో పాటు విధినిర్వహణలో అలసత్వం చూపిస్తే క్షమార్హులు కాదని హెచ్చరించారు కూడా.