Uttar Pradesh: యూపీలో కొవిడ్ కర్ఫ్యూ ఎత్తేశారు.. నాలుగు జిల్లాలు కాకుండా

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం కొవిడ్ కర్ఫ్యూ ఎత్తేసింది. రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలు ఎ్తతేసినా ఆ 4జిల్లాల్లో మాత్రం కర్ఫ్యూ కొనసాగాలని నిర్ణయించింది. మీరట్, లక్నో, సహరాన్పూర్, గోరఖ్‌పూర్ లలో మాత్రమే సోమవారం నుంచి కర్ఫ్యూ కొనసాగనుంది.

కొవిడ్ యాక్టివ్ కేసులు 600కంటే తక్కువ ఉన్నాయనే ఉద్దేశ్యంతో 71జిల్లాల్లో నిబంధనలు తొలగించారు. 600కంటే ఎక్కువ కేసులు ఉన్న ఆ నాలుగు జిల్లాల్లో మాత్రం కర్ఫ్యూ కొనసాగిస్తారు.

శనివారం కరోనా కర్ఫ్యూ నిబంధనలపై యూపీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. బరేలీ, బులంద్‌షార్ జిల్లాల్లో జూన్ 7నుంచి తొలగించారు. కంటైన్మెంట్ జోన్లుగా లేని ప్రదేశాల్లో షాపులు, మార్కెట్లను ఓపెన్ చేసి ఉంచుకోవచ్చని చెప్పారు.

ఆదివారం నాటికి కొత్తగా 11వందల కేసులు నమోదవడంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులు 17వేలకు చేరాయి. దేశవ్యాప్తంగా ఆదివారానికి కరోనా కేసులు లక్షా 14వేల 460మాత్రమే ఉన్నాయి. రెండు నెలలుగా అత్యంత తక్కువ ఇన్ఫెక్టివ్ కేసులు ఫైల్ అవుతున్నాయి. దీంతో మొత్తం ఇన్ఫెక్షన్ కేసులు 2కోట్ల 88లక్షల 9వేల 339 ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు