Uttar Pradesh Crime : ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతుండగా ఏడ్చిన కొడుకు.. దారుణానికి పాల్పడిన తల్లి.. నెలరోజుల తరువాత వెలుగులోకి

Uttar Pradesh Crime : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మథురలో మానవత్వాన్ని కలచివేసే ఘటన వెలుగుచూసింది. ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతుండగా ఏడుస్తూ విసిగించాడనే కారణంతో ఓ తల్లి తన మూడేళ్ల కుమారుడి పట్ల దారుణంగా ప్రవర్తించింది.

Uttar Pradesh Mathura crime

Uttar Pradesh Crime : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మథురలో మానవత్వాన్ని కలచివేసే ఘటన వెలుగుచూసింది. ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతుండగా ఏడుస్తూ విసిగించాడనే కారణంతో ఓ తల్లి తన మూడేళ్ల కుమారుడి పట్ల దారుణంగా ప్రవర్తించింది. చిన్నారి గొంతు నులిమి హత్య చేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. నెలరోజుల పాటు ఈ ఘటనను సహజ మరణంగా నమ్మించిన ఆమె, చివరకు భర్త చెవిన పడిన మాటలతో దొరికిపోయింది. కాల్ డేటా, పోస్టుమార్టం ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.

Also Read : Bonda Umamaheswara Rao : అందరిలా నేనూ వెళ్లి వచ్చా.. పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ వ్యవహరించను : అధిష్టానానికి బోండా ఉమ వివరణ!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రుచి జిందాల్‌ (32) అనే వివాహిత మహిళ తన ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో ఏడుస్తూ ఇబ్బంది పెట్టాడనే కారణంతో తన మూడేళ్ల కుమారుడిని గొంతు నులిమి హత్య చేసింది. ఈ ఘటన జూన్‌ 28న బల్‌దేవ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. బాలుడిని హత్యచేసిన తరువాత రుచి తన భర్తకు ఫోన్ చేసి, బాబు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడని తెలిపింది. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అంతకుముందు రోజు పోలియో చుక్కలు వేయడంతో వాటి ప్రభావమే కారణమై ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావించి అనుమానం వ్యక్తం చేయలేదు.

హత్య అనంతరం రుచి తన భర్తకు ఫోన్‌చేసి, బాబు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడని తెలిపింది. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అంతకుముందు రోజు పోలియో చుక్కలు వేయడంతో వాటి ప్రభావమే కారణమై ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావించి అనుమానం వ్యక్తం చేయలేదు.

అయితే సోమవారం రుచి మళ్లీ తన ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో చిన్నారి హత్య విషయాన్ని ప్రస్తావించగా.. ఆ సంభాషణ భర్త చెవిన పడింది. దీంతో అతడు పోలీసులకు సమాచారం అందించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.