క్వారంటైన్ రూల్స్ ఉల్లంఘించారని 6 నెలల శిశువు, 2 ఏళ్ల పిల్లాడిపై కేసు నమోదు!

  • Publish Date - April 28, 2020 / 07:25 AM IST

దేశంలో లాక్ డౌన్ సమయంలో క్వారంటైన్ రూల్స్ ఉల్లంఘించారంటూ 6 నెలల పసికందు, 2 ఏళ్ల వయస్సు పిల్లాడిపై ఉత్తరాఖండ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తర్కాశి జిల్లాలోని రెవెన్యూ పోలీసులు క్వారంటైన్ నిబంధనల ఉల్లంఘన కింద మొత్తం 51 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో పసికందు, రెండేళ్ల పిల్లాడు కూడా ఉన్నారు. పసిబిడ్డలపై పోలీసులు కేసు నమోదు చేయడంపై ఉత్తరకాశి జిల్లా మేజిస్ట్రేట్ (DM) ఆగ్రహం వ్యక్తం చేసింది. జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద 8 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిపై FIR నమోదు చేయరాదు. ఈ కేసులో దర్యాప్తు జరుగుతోందని  DM పేర్కొంది. 

బాలలపై జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం చేసిన జిల్లా కోవిడ్ -19 మేజిస్ట్రేట్‌పై క్రమశిక్షణ, సస్పెన్షన్ చర్యలు తీసుకుంటామని డీఎం తెలిపారు ఈ కేసుకు సంబంధించి నివేదికను కూడా డీఎం కోరారు. కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మే 3 వరకు కొనసాగనుంది. ఈ సమయంలో అవసరమైన సేవలను అందించే రంగాలకు మాత్రమే పనిచేయడానికి అనుమతించారు.

 

ప్రజలంతా ఇళ్లలకే పరిమితమయ్యారు. అవసరమైన వస్తువుల కోసమే చాలామంది బయటకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో మొత్తం COVID-19 కేసులు 47 నమోదు కాగా, 24మంది కరోనా బాధితులు ఇప్పటివరకు కోలుకున్నారు. లాక్ డౌన్ సమయంలో క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్కాశి జిల్లా రెవెన్యూ పోలీసులు 6 నెలల పసికందు, 2 ఏళ్ల చిన్నారితో సహా 51 మందిపై కేసు నమోదు చేశారు.

కొవిడ్-19 నుంచి కోలుకున్న 24 మంది వ్యక్తులలో 9 నెలల వయసున్న శిశువు కూడా ఉంది. తబ్లిఘి జమాత్ సభ్యులతో కాంటాక్ట్ అయిన చిన్నారి తండ్రి నుండి 9నెలల శిశువుకు కరోనా వైరస్ సోకింది. గత 24 గంటల్లో దేశంలో 1,684 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది మొత్తం 23,077 కు చేరుకుంది. మరణించిన వారి సంఖ్య 718కి చేరింది. రికవరీ రేటు 20.57 శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లావ్ అగర్వాల్ అన్నారు. గత 28 రోజుల్లో 15 జిల్లాలకు కొత్త కేసులు నమోదు కాలేదు. ఇప్పటి వరకు దేశంలో 80 జిల్లాల్లో గత 14 రోజుల్లో కొత్త కేసులు నమోదు కాలేదు.