Doctor Revives Newborn Baby: ఊపిరి ఊది చిన్నారి ప్రాణం నిలబెట్టిన డాక్టర్.. వీడియో వైరల్
తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి డాక్టర్లు ఎందరి ప్రాణాల్నో నిలబెడుతుంటారు. తాజాగా ఒక డాక్టర్ చిన్నారికి ఊపిరిలూది ప్రాణం పోసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
- Narender Thiru
- Published On : September 22, 2022 / 01:28 PM IST
Doctor Revives Newborn Baby: ప్రాణాలు పోసే శక్తి తల్లికి.. ఆ తర్వాత డాక్టర్లకే ఉంటుందంటారు. ఈ వీడియో చూస్తే ఆ విషయం మరోసారి నిజమనిపిస్తుంది. ఆగ్రాలోని ఒక ప్రభుత్వాసుపత్రిలో ఒక మహిళ, శిశువుకు జన్మనిచ్చింది.
Quadruplets Joy: ఒకే కాన్పులో నలుగురు పిల్లలు.. ఒడిశాలో జన్మనిచ్చిన మహిళ
అయితే, పుట్టిన తర్వాత ఆ శిశువు ఏడ్వడంగానీ, ఎలాంటి కదలికగానీ లేదు. ఆ చిన్నారి బతకాలంటే అత్యవసర వైద్యం అవసరం. కానీ, అక్కడ ఆక్సిజన్ మెషీన్ కూడా పనిచేయడం లేదు. ఈ సమయంలో అక్కడి డాక్టర్ తన ప్రతిభను ఉపయోగించి చిన్నారికి ప్రాణాలు పోసింది. డా.సురేఖా చౌదరి అనే డాక్టర్.. తన నోటితో చిన్నారి నోట్లోకి గాలిని ఊది, వీపుపై తడుతూ అత్యవసర చికిత్స అందించింది. ఈ చికిత్సతో చిన్నారిలో కదలిక వచ్చింది.
ఆ పాప పుట్టిన ఏడు నిమిషాల తర్వాత కదిలి, డాక్టర్ వంక చూసింది. తన బాధ్యతను చక్కగా నిర్వర్తించి, ఒక చిన్నారికి ప్రాణం పోసిన డాక్టర్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
डॉक्टर सुलेखा चौधरी, पीडियाट्रीसियन, CHC, आगरा।
बच्ची का जन्म हुआ लेकिन शरीर में कोई हलचल नहीं थी।
बच्ची को पहले ऑक्सिजन सपोर्ट दिया, लेकिन जब उससे भी लाभ नहीं हुआ तो लगभग 7 मिनट तक ‘माउथ टू माउथ रेस्पिरेशन’ दिया, बच्ची में साँस आ गई।??❤️#Salute #Doctor #respect pic.twitter.com/1PQK8aiJXQ— SACHIN KAUSHIK (@upcopsachin) September 21, 2022
