Kerala Landslides : కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. వయనాడ్‌లో చూస్తుండగానే బీభత్సం.. భయానక దృశ్యాలు రికార్డు..!

Kerala Landslides : వయనాడ్ జిల్లాలో ఒక్కసారిగా కొండచరియలు విరచుకుపడ్డాయి. ఈ ప్రమాద ఘటనలో ఇప్పుటివరకూ ఆరుగురు మృతిచెందగా, పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్టు సమాచారం.. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

Kerala Landslides

  • వయనాడ్ జిల్లా కల్లాడిలోని మీనాక్షి వంతెన సమీపంలో విరిగిప‌డిన కొండచరియలు
  • ఈ ఘటనలో ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు, మరో ఏడుగురు గల్లంతు
  • వైర‌ల్‌గా మారిన ల్యాండ్ స్లైడ్ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు

Kerala Landslides : కేరళలో భారీ వర్షాలు బెంబేలితిస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరుచుకుపడ్డాయి. మంగళవారం (జూలై 7న) మెప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద కొండచరియలు విరిగిపడటంతో కనీసం ఇద్దరు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. అలాగే ఏడుగురు గల్లంతయ్యారు. వయనాడ్–మలప్పురం సొరంగ రహదారి ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్న మీనాక్షి వంతెన సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి.

అగ్నిమాపక, సహాయక సేవల సిబ్బంది, పోలీసులు, జాతీయ విపత్తు దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కొనసాగుతున్న సహాయక చర్యలు :
ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు కేరళ ఆరోగ్య మంత్రి మురళీధరన్ ధృవీకరించారు. ప్రస్తుతానికి ఇద్దరు మరణించినట్లు అధికారికంగా వెల్లడించారు. రహదారిని క్లియర్ చేశాకే సహాయక చర్యలు పూర్తి చేస్తామన్నారు. కేరళం వెలుపలి ప్రాంతాలకు చెందిన కూలీల చికిత్స కోసం వయనాడ్‌లోని అన్ని ఆస్పత్రులను ఆదేశించినట్టు తెలిపారు. ఈ ఘటనలో స్థానికులెవరూ గాయపడలేదని ప్రాథమిక నివేదిక సూచిస్తోందని మురళీధరన్ తెలిపారు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం వయనాడ్‌లోని ఆస్పత్రులకు తరలించాలని ఆదేశించారు. ఘటనా స్థలంలో అంబులెన్స్ సేవలను మోహరించామని ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. అధికారుల ప్రకారం.. సొరంగం ప్రాజెక్టుకు సంబంధించిన కార్మికులు బస చేసే ప్రాంతంలో స్థానిక నివాసితులు ముగ్గురిని రక్షించారు.

Read Also : Amaravati New Tirumala : భక్తులకు శుభవార్త.. అమరావతిలో మరో తిరుమల.. ఏడంతస్తుల మహారాజగోపురంతో శ్రీవారి వైభవం!

ఆ ప్రదేశంలో కొన్ని ఇళ్లు, హోమ్‌స్టేలు కూడా ఉన్నాయి. మరికొంత మంది చిక్కుకుపోయి ఉండవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారీ వర్షాల కారణంగా సొరంగం నిర్మాణ స్థలం నుంచి శిథిలాలు జారిపడటంతో ఐదుగురు గాయపడ్డారని కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (KSDMA) తెలిపింది.

పూర్తిగా ధ్వంసమైన వాహనాలు :
కార్మికులను తీసుకెళ్లే అనేక వాహనాలు కొండచరియ విరిగిపడటంతో దెబ్బతిన్నాయి. మీనంగాడిలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని ఘటనా స్థలానికి పంపారు. సహాయక చర్యలలో కోజికోడ్ నుంచి మరో బృందాన్ని కూడా పంపారు. వయనాడ్ జిల్లా అధికారులు, రాష్ట్ర మంత్రి టి. సిద్ధిఖీ ఈ సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నారు. ఇంకా ఎవరైనా చిక్కుకుపోయారో లేదో తెలుసుకునేందుకు ఆయన జిల్లా కలెక్టర్‌తో కలిసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

కేరళ సీఎం విడి సతీశన్ వయనాడ్ జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో పరిస్థితిని సమీక్షించారు. అనంతరం అత్యవసర సమావేశం నిర్వహించినట్టు సీఎంవో తెలిపింది. సహాయక, పునరావాస చర్యలను పర్యవేక్షించేందుకు రెవెన్యూ మంత్రి ఏపీ అనిల్ కుమార్, మంత్రి టి సిద్ధిక్‌లను తక్షణమే వయనాడ్‌కు వెళ్లాలని ఆయన ఆదేశించారు.

నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం :
ఈ ఘటనపై స్పందిస్తూ.. వయనాడ్‌లోని కల్లాడిలో జరిగిన కొండచరియల విపత్తు నిర్లక్ష్యం వల్ల సంభవించిందని కేరళం మంత్రి టి. సిద్ధిక్ ఆరోపించారు. ఈ ప్రమాదంపై అధికారులు కొంకణ్ రైల్వేస్‌ను ముందుగానే హెచ్చరించినా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు.

ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించినట్టు తెలిపారు. అలాగే ప్రమాదంలో గల్లంతైన వారికోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.