పనస పండు కోసం చెట్టెక్కిన ఏనుగు

ఏనుగు చెట్టు ఎక్కడమే అరుదైన విషయమైతే అది పనసపండు తినడానికి అని తెలిశాక మరింత ఆసక్తికరంగా మారింది. ఈ ఘటనను ఓ నెటిజన్ ఆన్ లైన్ లో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఏనుగులు సాధారణంగానే పనసపండు ఇష్టపడతాయి. వాసనను ఇట్టే పసిగడతాయి. 

ఓ పనసతోటలోకి ప్రవేశించిన ఏనుగు చెట్టు పైకి కాళ్లు పెట్టి తొండంతో పనసకాయను కోసింది. నేలమీద పడిన కాయను కాలితో తొక్కి చితికేలా చేసింది. ఆ తర్వాత లోపలి గుజ్జును తొండం సాయంతో తీసుకుని నోట్లో పెట్టుకుంది. ఈ వీడియో మొత్తాన్ని పర్వీన్ కస్వాన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. 

ఇంకో వైరల్ వీడియోలో ఏనుగు తన పిల్లను కాపాడిన వాళ్లకు సహజ రీతిలో థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోయింది. గోతిలో పడిపోయిన ఏనుగు పిల్లను ప్రొక్లెన్ సాయంతో పైకి వచ్చేలా మట్టి తవ్వారు. దాంతో ఏనుగు పిల్ల పైకి రాగలిగింది. మనుషుల నుంచి అందిన సాయానికి ఏనుగు తొండం పైకి ఎత్తి థ్యాంక్స్ చెప్పి దాని పిల్లను తీసుకుని గుంపుతో కలిసి వెళ్లిపోయింది.