Noida viral video: కార్లతో నడిరోడ్డుపై స్టంట్లు చేశారు కొందరు విద్యార్థులు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని నోయిడాలో చోటుచేసుకుంది. వైట్ టొయోటా ఫార్చునర్ ఎస్వీయూ కార్లతో నోయిడాలోని సెక్టార్ 126 ప్రాంతంలో రోడ్లపైకి వచ్చిన విద్యార్థులు సినిమాల స్టైల్లో స్టంట్లు చేశారు.
ఆ విద్యార్థులు అమిటీ వర్సిటీకి చెందిన వారుగా తెలుస్తోంది. 360-డిగ్రీ డ్రిఫ్ట్ స్టంట్లు చేస్తూ వారు అత్యుత్సాహం ప్రదర్శించగా కొందరు వీడియోలు తీశారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల ద్వారా పోలీసుల వరకూ వెళ్లాయి. సాధారణంగా ఆ విద్యార్థులు చేసిన స్టంట్ల వంటివి సినిమాల్లోనే చూస్తుంటాం. నిజజీవితంలో ఇటువంటివి చేయాలంటే ప్రత్యేకమైన ఖాళీ స్థలాల్లో నిపుణుల పర్యవేక్షణలో చేయాల్సి ఉంటుంది.
అయితే, జనాలు తిరిగే రోడ్లపై కారుతో స్టంట్లు చేశారు ఆ యువకులు. తమ ప్రాణాలకే కాకుండా రోడ్డుపై వెళ్లే ఇతరుల ప్రాణాలకూ ముప్పు కలిగేలా వ్యవహరించారు. పార్కింగ్ స్థలం వద్ద కూడా ఇలాగే చేస్తూ కారును ఆపారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
#Noida एमिटी यूनिवर्सिटी में रहीसजादों की स्टंटबाजी,
फॉर्च्यूनर गाड़ी से स्टंट मारते वीडियो वायरल, ना कानून का खौफ ना पुलिस प्रशासन का
बीच सड़क पर खतरनाक कर रहे स्टंट बाजी,
थाना सेक्टर 126 क्षेत्र का बताया जा रहा वीडियो@noidapolice @CP_Noida @Uppolice pic.twitter.com/QCICOjV7eh
— PRIYA RANA (@priyarana3101) December 24, 2022