Viral Video : కదులుతున్న రైలే వేదిక.. ప్రయాణికులే అతిథులు.. జంట పెళ్లి వీడియో వైరల్

పెళ్లంటే చాలా తంతు ఉంటుంది. రెండు, మూడు నెలల నుండి పెళ్లి పనులు మొదలుపెడతారు. కానీ ఓ జంట చేసుకున్న పెళ్లి వేడుక చూసి జనం షాకయ్యారు.

Viral Video : ఇంట్లో పెళ్లంటే మూడు నెలల నుంచి హడావిడి మొదలవుతుంది. ఫంక్షన్ హాల్ బుక్ చేయడం, అతిథుల్ని ఆహ్వానించడం, షాపింగ్‌లు వగైరా వగైరా.. కానీ ఓ జంట పెళ్లికి ఇవేమీ అవసరం లేకుండా చాలా సింపుల్‌గా జరిగిపోయింది. పెళ్లిళ్లు ఇలా కూడా చేసుకోవచ్చునా? అని అందరూ షాకవుతున్నారు. ఇంతకీ ఆ జంట పెళ్లి విశేషాలు చదవండి.

Virat kohli : హాలిడే ట్రిప్.. కుమార్తె వామికతో కలిసి లండన్‌లో కోహ్లీ, అనుష్క శర్మ.. వీడియో వైరల్

డిస్టినేషన్ వెడ్డింగ్, థీమె వెడ్డింగ్స్ అంటూ ఇటీవల చాలామంది విపరీతంగా డబ్బులు ఖర్చు చేసి వేడుకగా పెళ్లి చేసుకుంటున్నారు. కొందరు కదిలే విమానాలు, నీటి అడుగున అంటూ కూడా వెరైటీగా పెళ్లి చేసుకుంటున్నారు. అయితే వాటికి భారీగానే ఖర్చవుతుంది. పెళ్లిదండలు, మంగళసూత్రం తప్ప పెద్ద ఖర్చు లేకుండా పెళ్లి చేసుకున్నారు ఓ జంట. ఎక్కడంటే? కదులుతున్న ట్రైన్‌లో. ఆశ్చర్యపోతున్నారా? బెంగాల్-జార్ఖండ్ రైలులో ఓ జంట పెళ్లి చేసుకున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

max_sudama_1999 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియోలో ఓ యువకుడు యువతి మెడలో మంగళసూత్రం కట్టడం, నుదుటన సింధూర్ పెట్టడం.. ఆ తర్వాత జంట దండలు మార్చుకోవడం కనిపించింది. ప్రయాణికులంతా వారిని చుట్టుముట్టి ఫోటోలు తీయడం కూడా కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘బహుళ ప్రయోజన భారతీయ రైల్వేలు’ అని ఒకరు.. ‘పెళ్లి చేసుకోవడం సులభమే.. విడాకుల ప్ర్రక్రియను ఎందుకు బాధాకరంగా మార్చారు’ అని కామెంట్లు పెట్టారు. ప్రస్తుతం ఈ పెళ్లి వీడియో వైరల్ అవుతోంది.

Viral Video : నీ గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్.. తుపాకులతో కాల్పులకు దిగిన రౌడీలను చీపురు కర్రతో తరిమికొట్టిన మహిళ, వీడియో వైరల్

గతంలో బీహార్ రాష్ట్రానికి చెందిన అషుకుమార్, అనుకుమారి అనే ప్రేమ జంట కూడా బెంగళూరు ట్రైన్‌లో పెళ్లి చేసుకున్నారు. ట్రైన్ ఎక్కిన తర్వాత తన ప్రియురాలు మెడలో తాళి కట్టమని ఒత్తిడి చేయడంతో రైలు టాయిలెట్ ముందు నిలబడి నుదుటిపై బొట్టు పెట్టి తాళి కట్టానని అప్పట్లో అషు కుమార్ చెప్పాడు. వీరి పెళ్లి ఫోటోలు వైరల్ అయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు