Viral Video : ఇద్దరు చిన్నారులు.. మహా అయితే ఇద్దరి వయసు 10 లోపు ఉంటుంది. కారు టాప్ మీద నిద్రిస్తూ కనిపించారు. గోవాలో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణిస్తున్న ఆ చిన్నారుల వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసారు.
Kalki 2898 AD : బాంబే ఐఐటి ఫెస్ట్‌లో కల్కి పోస్టర్స్ సందడి.. వైరల్ అవుతున్న ఫోటోలు..
మపుసా సమీపంలోని పర్రా గ్రామం మదానీలో తీసిన ఓ వీడియో జనాలను షాక్‌కి గురి చేసింది. @pulse_pune అనే ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేయబడిన వీడియోలో కారు టాప్ పైన ఇద్దరు చిన్నారులు ప్రమాదకర పరిస్థితుల్లో నిద్రపోతున్నట్లు కనిపించారు. ఓ వ్యక్తి ఈ వీడియోను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. కారులో ఉన్న వ్యక్తి నిర్లక్ష్యంగా ఏదో అనడం వీడియోలో వినిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసారు. మపుసా పోలీస్ స్టేషన్లో డ్రైవర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ నిధిన్ వల్సన్ చెప్పారు.
Dosa: అక్కడ మసాల దోశ 600 రూపాయలు.. వీడియో వైరల్
పోలీసుల చెబుతున్న ప్రకారం ఈ వీడియో డిసెంబర్ 27 న సోషల్ మీడియాలో అప్లోడ్ చేసారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ చిన్నారుల తల్లిదండ్రుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. సోషల్ మీడియాలో ఈ క్లిప్ వైరల్ అవుతోంది.
#Goa #viralvideo : Children Spotted Sleeping on Roof of Moving SUV Raises Concerns for Child Safety https://t.co/sRXrNavBRo pic.twitter.com/7djb5DIxB8
— Pune Pulse (@pulse_pune) December 28, 2023