Viral Video: టికెట్ లేకుండా ఎంత మంది రైలు ఎక్కారో చూడండి..
స్లీపర్ కోచ్ కాస్తా జనరల్ కోచ్‌గా మారిపోయిందని, ఇందులోని చాలా మంది ప్రయాణికులు..
- T Venkateshwarlu
- Published on- April 15, 2024 / 07:09 PM IST
Viral Video
టికెట్ లేకుండా రైలు ఎక్కి స్లీపర్ కోచ్‌లో కూర్చొని ప్రయాణం చేశారు కొందరు ప్రయాణికులు. స్లీపర్ కోచ్‌లో ఫ్లోర్ పై కూర్చొని ప్రయాణించిన వారితో అక్కడ టికెట్ కొనుక్కుని ఎక్కినవారు కాలు కదపలేని పరిస్థితి ఎదురైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి రైల్వే శాఖకు ఓ ప్రయాణికుడు ఫిర్యాదు చేశారు.
తాను ప్రయాణిస్తున్న సుహైల్‌దేవ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నంబరు 22420లోని స్లీపర్ కోచ్ కాస్తా జనరల్ కోచ్‌గా మారిపోయిందని, ఇందులోని చాలా మంది ప్రయాణికులు టికెట్ లేకుండా రైల్లో ఫ్లోర్ పై కూర్చొని ప్రయాణించారని వాపోయారు. ఆ ప్రయాణికుడి ట్వీట్ పై ‘రైల్వే సేవ’ స్పందించింది. ఫిర్యాదు చేసిన వ్యక్తి ప్రయాణ వివరాలు, మొబైల్ నంబర్‌ను ఇవ్వాలని కోరింది.
లేదంటే railmadad.indianrailways.gov.inలో వివరాలు తెలపాలని చెప్పింది. లేదంటే సత్వర పరిష్కారం కోసం 139కి ఫోన్ కూడా చేయొచ్చని తెలిపింది. టికెట్ తీసుకుని ఎక్కిన రైల్వే ప్రయాణికులకు ఎదురైన అనుభవంపై నెటిజన్లు మండిపడుతున్నారు. టికెట్ తీసుకోకుండా ఎక్కినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
