Cricket Betting Gang : డబ్బే డబ్బు.. వారి బ్యాంకు ఖాతాల్లో రూ.2కోట్లు, హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్‌ ముఠా గుట్టురట్టు

ఆన్ లైన్ బెట్టింగ్ లో ఎంతో మంది యువకులు లక్షలాది రూపాయలు పొగొట్టుకున్నారు. బెట్టింగ్ నిర్వాహకులు బ్యాంకు ఖాతాల్లో రూ.2కోట్లకు పైగా నగదు ఉంది.

Cricket Betting Gang : డబ్బే డబ్బు.. వారి బ్యాంకు ఖాతాల్లో రూ.2కోట్లు, హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్‌ ముఠా గుట్టురట్టు

Cricket Betting Gang Busted By Hyderabad Police

Cricket Betting Gang : హైదరాబాద్ లో ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. మాదాపూర్ లో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ ని పోలీసులు పట్టుకున్నారు. మాదాపూర్ ఎస్వోటీ లోకల్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి 5 గ్యాంగులకు చెందిన 15మంది బుకీలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 2కోట్ల 41లక్షల 6వేల రూపాయల విలువ చేసే సామాగ్రిని సీజ్ చేశారు.

నరసరావుపేటకు చెందిన రామాంజినేయులును ప్రధాన బుకీగా పోలీసులు తేల్చారు. మూడు వెబ్ సైట్ల ద్వారా నెల రోజుల్లో కోటిన్నర రూపాయలకు పైగా బెట్టింగ్ రాయుళ్లు పందెం కాశారు. ఆన్ లైన్ బెట్టింగ్ లో ఎంతో మంది యువకులు లక్షలాది రూపాయలు పొగొట్టుకున్నారు. బెట్టింగ్ నిర్వాహకులు బ్యాంకు ఖాతాల్లో రూ.2కోట్లకు పైగా నగదు ఉంది. బెట్టింగ్ డబ్బులు డిపాజిట్ అవుతున్న 57 బ్యాంకు అకౌంట్లను అధికారులు ఫ్రీజ్ చేశారు.

హైదరాబాద్ లో గుట్టుచప్పుడు కాకుండా ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ నడుపుతున్న గ్యాంగ్ గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. ఇటీవలి కాలంలో చాలాచోట్ల ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాలను పట్టుకున్నారు. తాజాగా శంషాబాద్, బాలానగర్, మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు లోకల్ పోలీసుల సాయంతో హైదరాబాద్ లో 5 చోట్ల ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నారు. 5 గ్యాంగులకు సంబంధించి 15మందికి పైగా బుకీలను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సుమారుగా 3.29 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నారు. వారి బ్యాంకు ఖాతాల్లో ఉన్న మరో 2కోట్ల రూపాయల నగదు ఫ్రీజ్ చేశారు.

ఇటీవలి కాలంలో దేశంలో బెట్టింగ్ మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్ నిర్వహిస్తోంది. బెట్టింగ్ మాఫియా కన్ను హైదరాబాద్ పైనా పడింది. నగరంలో కొన్ని గ్యాంగులు బెట్టింగ్ కు పాల్పడుతున్నాయి. ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ కు యువత బలైపోతోంది. వీరి ఉచ్చులో చిక్కుకుని ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. అప్పుల పాలవుతున్నారు. చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో అలర్ట్ అయిన పోలీసులు.. క్రికెట్ బెట్టింగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు.

Also Read : భారత్‌కు చెందిన ఈ వ్యక్తి ఆచూకీ చెబితే రూ.2కోట్లు రివార్డ్.. భార్యను చంపిన కేసులో అమెరికా పోలీసుల వేట