Vijay-Sangeetha Divorce: విజయ్ విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్.. పిటీషన్ వెనక్కి తీసుకున్న భార్య సంగీత

తమిళనాడు సీఎం విజయ్ జోసఫ్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఆయన భార్య సంగీత (Vijay-Sangeetha Divorce)విడాకులు వద్దు అంటూ పిటీషన్ ను వెనక్కి తీసుకుంది.

Vijay Joseph wife Sangeetha withdraws divorce petition

  • విడాకుల పిటిషన్ ఉపసంహరణ జరిగింది
  • విజయ్‌కు కోర్టులో లభించిన ఊరట
  • వివాదానికి ముగింపు పలికిన సంగీత

Vijay-Sangeetha Divorce: తమిళగ వెట్రి కళగం అధినేత, తమిళనాడు సీఎం విజయ్‌ వ్యక్తిగత జీవితంలో బిగ్ రిలీఫ్ లభించింది. గత కొంతకాలంగా సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన ఆయన విడాకుల(Vijay-Sangeetha Divorce) వ్యవహారానికి అనూహ్య మలుపుతో తాత్కాలికంగా తెరపడింది. విజయ్ సతీమణి సంగీత తన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకోవడంతో, చెంగల్పట్టులోని కుటుంబ సంక్షేమ కోర్టు ఈ కేసును అధికారికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

Indiramma Indlu: ముగియనున్న ‘ఇందిరమ్మ ఇండ్లు’ దరఖాస్తు ప్రక్రియ.. లాస్ట్ డేట్ ఇదే? వెంటనే అప్లై చేసుకోండి ఇలా!

కోర్టు విచారణ – వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు:

2025 డిసెంబరు 5న సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన కేసు విచారణకు ఆమె నేరుగా రాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై, పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు న్యాయమూర్తికి తెలిపారు. దీనిపై విజయ్ తరఫు న్యాయవాదులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో న్యాయస్థానం కేసును పూర్తిగా క్లోజ్ చేసింది.

రాజీ యత్నాలు – రాజకీయంగా ఊరట:

సంగీత హఠాత్తుగా ఈ పిటిషన్‌ను ఎందుకు వెనక్కి తీసుకున్నారనే దానిపై అధికారిక స్పష్టత రానప్పటికీ, ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిరిందనే ప్రచారం జరుగుతోంది. తమిళనాడు సీఎం పదవి లక్ష్యంగా, రాజకీయాల్లో వేగంగా అడుగులు వేస్తున్న విజయ్‌కు ఈ వివాదం ముగియడం వ్యక్తిగతంగా, రాజకీయంగా పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.