వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సుజనా చౌదరిని టార్గెట్ చేశారు. నిన్ను టార్గెట్ చేయడం ఏమంత పెద్ద విషయం కాదు. నువ్వు బాబు కోసం కోవర్ట్ అనే ముద్ర నిరూపించుకోవడానికి తలకిందులుగా తపస్సు చేయాలని కౌంటర్ వేశారు. ఫేస్‌బుక్ వేదికగా సుజనా చౌదరిపై కామెంట్లు చేశారు.
”సుజనా చౌదరి .. నిన్ను టార్గెట్ చేయాలంటే తలకిందులుగా తపస్సు చేయాలా ? నీలాంటి చౌకబారు శరణార్ధులని మేము అసలు లెక్క చేయము. ముందు నీవు తలకిందులుగా తపస్సు చేయ్ . బాబు కోవర్ట్ అనే ముద్ర చెరుపుకోవడానికి” అని కామెంట్ చేశారు.
కొద్ది నెలల క్రితమే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనాను.. ఇంకా పాత రంగు మరిచిపోలేదంటూ కౌంటర్ విసిరారు. ”సుజనా చౌదరి మాటలు విని కొందరు బిజెపి నాయకులు నవ్వుకుంటున్నారు. జూనియర్ ఆర్టిస్ట్ వేషం వేసి.. మొత్తం ఇండస్ట్రీనే పెంచి పోషిస్తున్నట్లు బిల్డప్ ఇచ్చే కమెడియన్ ని గుర్తు తెచ్చుకుంటూ. కెమరా ముందుకు వచ్చినపుడే కాషాయం. మేకప్ తీస్తే ఒరిజినల్ పసుపు” అని చమత్కరించారు.
ఇక విజయసాయి రెడ్డి కౌంటర్లకు ఏం తక్కువ లేదు.. అంతే రేంజ్ లో షేర్లు, కామెంట్లతో వైరల్ టాపిక్ గా మారింది.