Forced Marriage : తలకు తుపాకీ గురిపెట్టి మరీ పెళ్లి చేశారు
దారిన పోతున్న ఓ యువకుడిని కిడ్నాప్ చేసి బలవంతపు వివాహం జరిపించారు కొందరు వ్యక్తులు. యువకుడు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో తలపై గన్ పెట్టి వివాహం జరిపించారు.
- kunduru Vinod
- Published On : November 21, 2021 / 12:49 PM IST
Forced Marriage
Forced Marriage : ఇంట్లో వేడుక ఉండటంతో బందువులకు ఆహ్వానించేందుకు పక్క గ్రామానికి వెళ్ళాడో యువకుడు. బంధువులను ఆహ్వానించి తిరిగి వస్తుండగా అతడికి అనుకోని వింత సంఘటన ఎదురైంది. పొరుగూరు ప్రజలు అతడిని బందించి బలవంతంగా వివాహం చేశారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రం నలంద జిల్లాలో జరిగింది. జిల్లాలోని ధనుకి గ్రామానికి చెందిన నితీష్ కుమార్ ఛథ్ పండుగకు ఆహ్వానించేందుకు నవంబర్ 11న పొరుగూరులో ఉండే వదిన ఇంటికి వెళ్ళాడు. పండుగకు రావాలని ఆహ్వానించి తిరిగి తన సొంత ఊరికి పయనమయ్యాడు.
చదవండి : Marriage Cheating : పెళ్లి పేరుతో మహిళను మోసం చేసిన దంపతులు
గ్రామానికి వస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు అతడిని కిడ్నాప్ చేశారు. అనంతరం అతడిని పెళ్లిమండపానికి తీసుకెళ్లి ముస్తాబు చేశారు. తనను వదిలిపెట్టాలని గ్రామస్తులను ఎంత కోరినా వారు వినలేదు. పారిపోయేందుకు ప్రయత్నించగా అతడిపై దాడి చేశారు. ఇక పెళ్లి జరుగుతున్న సమయంలో తాళికట్టేందుకు నిరాకరించడంతో అతడిని గన్‌తో బెదిరించి యువతి మేడలో తాళికట్టించారు.
చదవండి : Marriage : వధువు వింత షరతు : పెళ్ళికి వచ్చేవారు ‘ఏడువేలు’ తీసుకురండి!
ఎలాగోలా వారినుంచి బయటపడ్డ నితీష్ కుమార్ జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇక పెళ్ళికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
It happens only in #Bihar – अभी तक सुना अब देख भी लिए-
“ पकरुआ “ ?♀️?♀️?♀️ #marriage https://t.co/oef6cLoqcy— Monisha Dubey (@MonishaDJourno) November 21, 2021
