Marriage Cheating : పెళ్లి పేరుతో మహిళను మోసం చేసిన దంపతులు

పెళ్లి పేరుతో  దంపతులు, ఓ మహిళను మోసం చేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.

Marriage Cheating : పెళ్లి పేరుతో మహిళను మోసం చేసిన దంపతులు

Matrimonial Cheating

Marriage Cheating : పెళ్లి పేరుతో  దంపతులు, ఓ మహిళను మోసం చేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని సత్తెనపల్లికి చెందిన ఒక మహిళ అబ్బూరులోని ఓ బ్యాంకులో ఉద్యోగిగా పని చేస్తోంది. ఆమెకు మొదటి వివాహం విఫలమయ్యింది. రెండో వివాహం చేసుకునే నిమిత్తం ఇటీవల తన ప్రోపైల్ ను మ్యాట్రిమోనీ వెబ్ సైట్లో రిజిష్టర్ చేసుకుంది.

ఆమె బయోడేటా చూసిన   కార్తీక్ అనే వ్యక్తి తన   అమ్మ వాళ్లది  గుంటూరు జిల్లా తెనాలి  అని…. ఉద్యోగ రీత్యా చెన్నైలో పని చేస్తున్నానని….మీ ప్రోఫైల్ నచ్చిందని ఇంట్రెస్ట్ మెసేజ్ పంపించాడు. దీంతో ఇద్దరూ ఫోన్ నెంబర్లు మార్చుకుని రోజు చాటింగ్ చేసుకోవటం…మాట్లాడుకోవటం ప్రారంభించారు. ఈక్రమంలో ఆమెను మాయ మాటలతో లోబరుచుకున్నాడు. పెద్దలతో మాట్లాడి త్వరలో   మనిద్దరం పెళ్లి చేసుకుందామని నమ్మకం కల్గించాడు.

ఇలామాట్లాడుతూ ఒకరోజు….. తన కుటుంబానికి చెందిన ఆస్తులు నోట్ల రద్దు సమయంలో అమ్మేశామని…. అప్పుడు వచ్చిన కోట్లరూపాయల నగదు బ్యాంకులో ఉందని నమ్మించాడు.  పెద్ద  మొత్తంలో బ్యాంకులో డిపాజిట్ చేశారని వాటికి లెక్కలు చెప్పాలని ఐటీ అధికారులు ఆ డబ్బులు సీజ్ చేశారని చెప్పాడు. ప్రస్తుతం అది చెన్నై కోర్టులో విచారణలో ఉందని  తెలిపాడు.
Also Read : Shilpashetty – Rajkundra : మరో కేసులో శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా

ఐటీ అధికారులుకు కొంత నగదు చెల్లించాలని… నీ వద్ద నగదు ఉంటేఅప్పుగా ఇస్తే…. నా డబ్బులు రాగానే తిరిగి ఇచ్చేస్తానని కోరాడు.  అది నమ్మి సదరు బ్యాంకు ఉద్యోగిని తనవద్ద ఉన్న డబ్బుతో పాటు, తెలిసిన వాళ్ల  దగ్గర కూడా అప్పు చేసి రూ.32 లక్షల రూపాయలు   కార్తీక్   మేనత్త ఎకౌంట్‌కు   ట్రాన్సఫర్ చేసింది.  రోజులు గడుస్తున్నా   బ్యాంకు సీజ్ చేసిన డబ్బులు విషయం కానీ…. తాను ఇచ్చిన డబ్బు విషయం కానీ… పెళ్ళి విషయం కానీ మాట్లాడకుండా సాకులు చెప్పి   తప్పించుకోసాగాడు.

అనుమానం వచ్చిన బ్యాంకు ఉద్యోగిని తెనాలి వెళ్లి విచారించగా అసలు విషయం బయట పడింది. కార్తీక్ అసలు పేరు మహారాజ్ జానీరెక్స్ అనీ….అతనికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుసుకుంది. కార్తీక్ మేనత్తగా పరిచయం చేసి డబ్బులు ట్రాన్స్ఫర్   చేసిన మహిళ జానీరెక్స్ భార్య మహారాజ్ ప్రియ ది అని తెలుసుకుంది.

మోసపోయానని గ్రహించిన బాధిత మహిళ తెనాలి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.   తెనాలి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్  నమోదు చేసి, విచారణ నిమిత్తం కేసును సత్తెనపల్లి పోలీసు స్టేషన్ కు బదిలీ చేశారు. జానీరెక్స్   భార్య, ప్రియా మహరాజ్ ను అదుపులోకి తీసుకోగా.. జానీ రెక్స్ పరారీలో ఉన్నాడు.  భార్యా భర్తలిద్దరూ గతంలో కూడా అనేక  మందిని ఇలాగే మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా….. ఇచ్చిన నగదు తిరిగి రాకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యం అని బ్యాంకు ఉద్యోగిని విలపిస్తోంది.