Marriage : వధువు వింత షరతు : పెళ్ళికి వచ్చేవారు ‘ఏడువేలు’ తీసుకురండి!

తన వివాహానికి వచ్చే అతిథులు, బంధువులు తలో రూ.7 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. ఎందుకంటే పెళ్లి రిషెప్షన్‌ చేయడానికి తగినంత డబ్బు లేదని పేర్కొంది.

Marriage : వధువు వింత షరతు : పెళ్ళికి వచ్చేవారు ‘ఏడువేలు’ తీసుకురండి!

Marriage

Marriage : ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని తెలుగులో ఓ సామెత ఉంటుంది. ఇల్లు పెళ్లి అనేవి కనపడని ఖర్చులని దీని అర్ధం. మన దేశంలో పెళ్ళిల్లో బంధువులు సాయం చేయడం అనేది కామన్.. బంధువులు తమకు తోచినంత పెళ్లి ఖర్చుల కోసం ఇస్తుంటారు. అయితే కొందరు మాత్రం బంధువుల సాయం కోరకుండానే పెళ్లి జరిపిస్తుంటారు. పెళ్ళికి బంధువులు సాయం చేయడం అనేది తరతరాలుగా వస్తున్న ఆచారం . రాను రాను ఆచార వ్యవహారాల్లో మార్పులు వస్తుండటంతో ఈ విధానం కూడా చాలా ప్రాంతాల్లో కనుమరుగై పోయింది. గిఫ్ట్స్ సంస్కృతీ ప్రస్తుతం నడుస్తుంది.

చదవండి : Marriage Baraat : డాన్స్ చేస్తూ బోర్లాపడ్డ వధూవరులు

అయితే తాజాగా ఓ వధువు తన బంధువులు, స్నేహితులను వింతమైన విన్నపంతో వివాహ రిషెప్షన్‌కు ఆహ్వానించింది. తన వివాహానికి వచ్చే అతిథులు, బంధువులు తలో రూ.7 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. ఎందుకంటే పెళ్లి రిషెప్షన్‌ చేయడానికి తగినంత డబ్బు లేదని పేర్కొంది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ఇలా కూడా అడుగుతారా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

చదవండి : Marriage : ఇదేం పెళ్లిరా బాబు.. కర్రలతో కొట్టుకున్న వధూవరులు.. వైరల్ వీడియో

వధువు స్నేహితుడు ఆమె విన్నపాన్ని సంబందించిన పెళ్లి కార్డును సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నేటిట్లో వైరల్ అయింది. ‘మా వద్ద పెళ్లివేడుకలు నిర్వహించడానికి తగిన డబ్బు లేదు. పెళ్లికి వచ్చే బంధువులు, అతిథులుకు తలో రూ.7వేలు ($99) ఇవ్వాలని కోరుతున్నాము’ అని పెళ్లి ఆహ్వాన పత్రికలో తెలిపారని చెప్పాడు. ఇక తను ఉండే ప్రాంతం నుంచి వివాహం జరిగే చోటు చాలా దూరమని తెలిపాడు.

చదవండి : Rajasthan Child marriage : బాల్య వివాహాల రిజిస్ట్రేషన్‌ చట్టంపై వెనక్కి తగ్గిన రాజస్థాన్‌ ప్రభుత్వం

వివాహ వేదిక వడ్డీ ఓ బాక్స్ ఏర్పాటు చేసి ఉందని.. దయచేసి దానం చేయాలనీ తెలిపారు. అయితే ఈ వివాహ వేడుక అమెరికాలో జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంచి పని చేశావు.. మీకు నిజమైన బంధువులు, స్నేహితులు ఎవరో ఇప్పుడే తెలిసిపోతుందని కొందరు అంటే, మీరు డిమాండ్ చేయడం బాలేదు.. వారికి తోచినంత ఇస్తారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదిఏమైనా.. ఈ పెళ్లి కార్డు మాత్రం వైరల్‌గా మారింది.