Vinesh Phogat : అదో పెద్ద రాజకీయం.. పీటీ ఉషపై సంచలన వ్యాఖ్యలు చేసిన వినేశ్ ఫోగట్

పారిస్ ఒలింపిక్స్ లో హాస్పిటల్ బెడ్ పై ఉన్న నా వద్దకు వచ్చారు.. నాకేమీ చెప్పకుండానే.. నా అనుమతి లేకుండానే ఫొటోలు దిగారు.. ఆ తరువాత వాటిని ..

Vinesh Phogat

Vinesh Phogat : భారతీయ మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆమె హర్యానా ఎన్నికల్లో జులనా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఓ జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు అంశాలపై మాట్లాడారు. పారిస్ ఒలింపిక్స్ ఫైనల్ లో అనర్హతకు గురైన వినేశ్ ఫొగాట్ త్రుటిలో పతకం చేజార్చుకున్న విషయం తెలిసిందే. తన అనర్హతపై అప్పీలును కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్) కొట్టేసింది. ఆ సమయంలో జరిగిన విషయాలను ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా భారత ఒలింపిక్ సంఘంతోపాటు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చీఫ్ పీటీ ఉషపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: Congress : హర్యానాలో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. జులానా బరిలో వినేశ్ ఫొగాట్

పారిస్ ఒలింపిక్స్ లో హాస్పిటల్ బెడ్ పై ఉన్న నా వద్దకు వచ్చారు.. నాకేమీ చెప్పకుండానే.. నా అనుమతి లేకుండానే ఫొటోలు దిగారు.. ఆ తరువాత వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మేమంతా నీతోనే ఉన్నాం అంటూ చెప్పారు. అయితే, నా దగ్గరకు వచ్చినప్పుడు నా ఆరోగ్యం గురించి కూడా ఏమీ అడగలేదు. ఇదంతా షో కోసమే చేశారు.. ఆ సమయంలో పెద్ద రాజకీయం చేశారంటూ పీటీ ఉషపై వినేశ్ ఫోగట్ విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. కాస్ లో కేసును నాపేరు మీదనే ఫైల్ చేశా.. మామూలుగా అయితే దేశం పేరుతో చేయాల్సి ఉంది. కానీ, ప్రభుత్వం, ఐవోఏ నుంచి నాకు మద్దతు లభించలేదని ఫోగట్ పేర్కొన్నారు.

Also Read : ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఖర్గేను కలిసిన వినేశ్ ఫొగాట్.. సాక్షి మాలిక్ ఏమన్నారో తెలుసా? తనకూ ఆఫర్లు వచ్చాయంటూ..

నా గురించి ప్రభుత్వం పట్టించుకోవటమే మానేసింది. కేవలం సోషల్ మీడియాలో సానుభూతి తెలిపేందుకు మాత్రమే నాపై అనర్హతను వాడుకున్నారు. వారు మెడల్ ను ఎప్పుడో వదిలేశారు. హరీశ్ సాల్వే కేసును వాదించేందుకు వచ్చినప్పటికీ.. వారంతా మీడియా బైట్లు ఇచ్చే బిజీలో ఉండిపోయారు. చేసేదేమీలేక కాస్ లో థర్డ్ పార్టీగానే మేం వాదనలు వినిపించామని ఫోగట్ చెప్పారు. భారత రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఉన్నా.. బ్రిజ్ భూషన్ ఇంటి నుంచే డబ్ల్యూఎఫ్ఐ నడుస్తోందని వినేశ్ ఫోగట్ వ్యాఖ్యానించారు.

 

 

ట్రెండింగ్ వార్తలు