Viral video: క్యాంటీన్‌లో ఘర్షణకు దిగిన లాయర్లు.. సీనియర్ అడ్వకేట్‌ చెంపచెళ్లుమనిపించిన లేడీ లాయర్

లాయర్ల మధ్య జరిగిన గొడవతో క్యాంటీన్‌లోని టేబుళ్లపై ఆహార పదార్థాలు పడి పాడైపోయాయి. ఓ లాయర్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి..

Delhi High Court canteen

Delhi High Court: క్యాంటీన్‌లో లంచ్ చేద్దామని వచ్చిన కొందరు లాయర్లు సీటు కోసం ఘర్షణకు దిగారు. ప్రశాంతంగా ఉండే క్యాంటీన్ వాతావరణాన్ని చెడగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఢిల్లీ హైకోర్టు లాయర్లు క్యాంటీన్‌లో సీటు కోసం కొట్టుకున్నారు. లాయర్ల మధ్య జరిగిన ఘర్షణతో క్యాంటీన్‌లోని టేబుళ్లపై ఆహార పదార్థాలు పడి పాడైపోయాయి. భోజనం చేస్తున్న ఇతర లాయర్లు ఇబ్బంది పడ్డారు. ఓ లేడీ సీనియర్ అడ్వకేట్‌ను మరో మహిళా లాయర్ చెంపపై కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు.

భోజనానికి వచ్చిన లాయర్ల వద్దకు ఓ లేడీ లాయర్ దూసుకువచ్చి గొడవ పెట్టుకుందని అన్నారు. ఆమెకు సర్ది చెప్పేందుకు కొందరు సీనియర్ లాయర్లు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ లేడీ లాయర్ వినిపించుకోలేదు. టేబుళ్లపై ఉన్న ఆహార పదార్థాలను ఆమె చెల్లాచెదురు చేశారు.

ఓ లాయర్ తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన జరిగిన గొడవ గురించి చెప్పారు. ఈ దృశ్యాలన్నీ వీడియోలో చూడొచ్చు. భోజనం చేస్తున్న వారంతా ఈ గొడవ సమయంలో నిలబడాల్సి వచ్చింది. లాయర్లు ఇంతలా గొడవ పడడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

Lok sabha: పార్లమెంట్లో భద్రతా వైఫల్యం.. అసలేం జరిగింది? ఆగంతకులు ఏమని నినదించారు?