Viral Wedding Ad : ఓరి నాయనో.. ఆమెను పెళ్లి చేసుకోవాలంటే ఇన్ని రూల్సా..?! కాస్త ఓవర్ గా అనిపిస్తుందే..!
ఓరి నాయనో.. ఆమెను పెళ్లి చేసుకోవాలంటే ఇన్ని రూల్సా..?! కాస్త ఓవర్ గా అనిపిస్తుందే..! అనిపించేలా ఉంది ఓ అమ్మాయి తనకు కావాల్సిన వరుడు ఎలా ఉండాలో ఏం చదవాలో..ఎక్కడ చదివి ఉండాలో వంటి పలు అంశాల గురించి పెట్టిన రూల్స్ చూస్తే..
- nagamani
- Published on- October 20, 2022 / 02:53 PM IST
Viral Matrimonial Ad
Viral Matrimonial Ad : తాను వివాహం చేసుకోవాలనుకునే అబ్బాయి ఇలా ఉండాలి..అలా ఉండాలి ఆరు అడుగుల అందగాడు అయి ఉండాలని అమ్మాయిలు ఆకాంక్షిస్తారు. కానీ ఈ తరం అమ్మాయిల రిక్వయిర్ మెంట్ కాస్తా ఎక్కువగానే ఉంటున్నాయి. మంచి ఉద్యోగంతో పాటు ఆర్థికంగా కూడా మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ అమ్మాయి తను వివాహం చేసుకునే అబ్బాయికి ఉండాల్సినవి ఏంటో వివరించిన వెడ్డింగ్ యాడ్ ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సాధారణంగా అమ్మాయిలు అబ్బాయి అందంగా ఉండాలి..చక్కటి ఉద్యోగం ఉండాలని కోరుకుటుంటారు. కానీ ఈ అమ్మాయి పెట్టిన రూల్స్ వింటే ‘ఓరి నాయనో ఏంటా రూల్స్..మరీ ఇంత కాస్త ఓవర్ గా లేదూ’ అని అనిపించేలా ఉంది. ఇంతకీ సదురు అమ్మాయి పెట్టిన కండిషన్స్ ఏంటంటే..
ఓ మ్యాట్రిమోనియల్ ప్రకటనలో ఓ అమ్మాయి తనకు కావాల్సిన వరుడు ఏ సంవత్సరంలో పుట్టాలి. ఏయే డిగ్రీలు కలిగి ఉండాలి. ఒక వేళ ఆ డిగ్రీలు కలిగి ఉంటే ఏయే కాలేజీల్లో చదివి ఉండాలో సూచించింది. ఇక ఎత్తు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. కేవలం ఇద్దరు తోబుట్టువులు మాత్రమే ఉండాలని యాడ్‌లో స్పష్టంగా పేర్కొంది. అంతేనా ఇంకా ఉంది తెలుసుకోవటానికి కాస్త నోరెళ్లబెట్టలానికి..
అబ్బాయి 1992, జూన్ కంటే ముందు జన్మించి ఉండరాదు. డిగ్రీ కచ్చితంగా టైర్ వన్ విద్యాసంస్థల నుంచి పొంది ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ, ఎంటెక్, ఎంఎస్ లేదా పీజీడీఎం చేసి ఉండాలి. ఇంజినీరింగ్ చేసి ఉంటే.. కచ్చితంగా ఐఐటీ బాంబే, ఖరగ్‌పూర్, మద్రాస్, కాన్పూర్, ఢిల్లీ, రూర్కీ, గువహటి నుంచి చదివి ఉండాలి. లేదా ఎన్‌ఐటీ కాలికట్, ఢిల్లీ, కురుక్షేత్ర, జలంధర్ ట్రిచ్చి, సురత్కల్, వరంగల్ నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ పొంది ఉండాలని పేర్కొంది. లేదా ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, అలహాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ఐఐఎస్‌సీ బెంగళూరు, బిట్స్ పిలానీ, హైదరాబాద్, డీటీయూ, ఎన్‌ఎస్‌ఐటీ, జాదవ్‌పూర్ యూనివర్సిటీల నుంచైనా ఇంజినీరింగ్ చదివి ఉండాలని ఆ యువతి తన ప్రకటనలో పేర్కొంది.
ఎంబీఏ చేసి ఉంటే.. ఐఐఎం అహ్మదాబాద్, బెంగళూరు, కలకత్తా, ఇండోర్, లక్నో, కోజికోడ్, ఎఫ్‌ఎంఎస్, ఐఐఎఫ్‌టీ, ఐఎస్‌బీ, జేబీఐఎంఎస్, ఎండీఐ, ఎన్‌ఐటీఐఈ, ఎస్‌పీ జైన్, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ నుంచి ఎంబీఏ పట్టా పొంది ఉండాలని స్పష్టం చేసింది. మరి జీతం సంవత్సరానికి రూ. 30 లక్షల జీతం కచ్చితంగా సంపాదించాలని పేర్కొంది. ఇక అబ్బాయి ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతానికి చెందిన వాడై ఉండాలని..అబ్బాయి ఎత్తు 5.7 అడుగుల నుంచి 6 అడుగుల మధ్య ఉండాల పెద్ద లిస్టే యాడ్‌లో స్పష్టంగా పేర్కొంది సదరు యువతి. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తోంది. మరి పెళ్లి కాని అబ్బాయిలు మీలో ఈ క్వాలిటీస్ ఉంటే ఇంకెందుకు లేట్ ప్రొసీడ్ అవ్వొచ్చు..
