క్యూలో వెళ్లి ఓటేసిన కోహ్లీ

కోహ్లీ క్రికెట్‌లోనే కాదు. ఓటేసిన క్రికెటర్లలోనూ ముందు నిలిచాడు. గుర్‌గావ్‌లోని పోలింగ్ బూత్‌లో తన ఓటు వినియోగించుకున్నాడు. ఈ ఓటేసేందుకు భారీ క్యూలో నిల్చొని ఉన్న వీడియో వైరల్‌గా మారింది. ఓటేసేందుకు వచ్చిన కోహ్లీని మీడియా ప్రశ్నిస్తున్నా ఎవరితో మాట్లాడకుండా ముందుకు వెళ్లిపోయాడు. కొందరు అభిమానులకు మాత్రం ఆటోగ్రాఫ్‌లు ఇచ్చి వెళ్లిపోయాడు.

దాంతో పాటుగా ఓటరు అవగాహన కోసం కోహ్లీని పోలింగ్ బూత్ బయట కటౌట్ దగ్గర నిల్చొని ఫొటో దిగమని అడిగిన ఏజెంట్‌కు సహకరించాడు. ఆరో దశలో భాగంగా 7రాష్ట్రాల్లోని  59లోక్‌సభ స్థానాలకు ఆదివారం పోలింగ్ జరుగుతోంది.