భారత్ కూల్చివేసిన పాక్ యుద్ధ విమాన శకలాలివే

బుధవారం(ఫిబ్రవరి-27,2019) LOC దాటి భారత భూభాగంలోకి చొరబడిన పాక్ యుద్ధ విమానం ఎఫ్-16ని భారత్  కూల్చివేసిన విషయం తెలిసిందే. గురువారం(ఫిబ్రవరి-28,2019) ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ఎఫ్-16 విమాన శకలాలను దేశ ప్రజలకు చూపించారు.
Read Also : ఇమ్రాన్ ఖాన్ ప్రశ్న : 19ఏళ్ల యువకుడు మానవబాంబుగా ఎందుకు మారాడు

LOC దగ్గర నిరంతర నిఘా కొనసాగుతుందని త్రివిధ దళాలు ప్రకటించాయి. పాక్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగితే ధీటుగా బదులిస్తామని హెచ్చరించారు. ఉగ్రవాదులను భారత్ పైకి పాక్ ఉసిగొల్పుతున్నంత కాలం ఉగ్రశిబిరాలపై దాడులు చేస్తామని స్పష్టం చేశారు.

భారత్ చేయాలనుకున్నది, టార్గెట్ లను నాశనం చేయాలనుకున్నది, చేసిన దానికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, సీనియర్ల సలహా మేరకే కూల్చివేయబడిన పాక్ విమాన శకలాలను దేశ ప్రజలకు చూపించడం జరిగిందని వారు తెలిపారు.