BJP vs Congress: ముషార్రఫ్ మరణంపై థరూర్ కామెంట్స్ ఎఫెక్ట్.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం

శత్రు దేశం నేతపై పొగడ్తలు కురిపిస్తావా అంటూ కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బాలాకోట్ దాడుల విషయంలో భారత సైన్యాన్ని అనుమానించిందని, ఒసామా బిన్ లాడెన్‌ను పొగిడిందని, భారత సైన్యాధిపతిని రోడ్డు మీద గూండా అని వ్యాఖ్యానించిందని, ఇప్పుడు ముషారఫ్‌ను ప్రశంసిస్తోందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మండిపడ్డారు

BJP vs Congress: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, రిటైర్డ్ జనరల్ ఫర్వేజ్ ముషారఫ్ మరణంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ స్పందిస్తూ ‘స్మార్ట్’ అంటూ వ్యాఖ్యానించడంపై భారతీయ జనతా పార్టీ విమర్శలకు దిగింది. అనంతరం ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. కార్గిల్ ఘాతుకాన్ని మరిచిపోయారా అంటూ బీజేపీ నేతలు దాడి చేస్తుండగా, యుద్ధాల గురించి తమకు పాఠాలు నేర్పొద్దంటూ కాంగ్రెస్ నేతలు ప్రతి దాడి చేస్తున్నారు.

Karnataka: కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన.. ఇవే చివరి ఎన్నికలట

ముషారఫ్ మృతిపై శశి థరూర్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ అరుదైన వ్యాధితో మరణించారు. ఆయన ఒకప్పుడు భారత దేశానికి రాజీలేని శత్రువు. అయితే 2002-2007 మధ్య కాలంలో నిజమైన శాంతికాముకుడిగా మారారు. ఆ రోజుల్లో నేను ఐక్య రాజ్య సమితిలో ఆయనను ప్రతి సంవత్సరం కలిసేవాడిని. ఆయన చాలా తెలివైనవారు, కలుపుగోలుగా ఉంటారు. వ్యూహాత్మక ఆలోచనలో చాలా స్పష్టంగా ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు.

BRS in Nanded: నాందేడ్‭తో బీఆర్ఎస్ నేషనల్ ఎంట్రీ.. గులాబీ జెండా ఎత్తుకోవాలని మరాఠీలకు కేసీఆర్ పిలుపు

అంతే, శత్రు దేశం నేతపై పొగడ్తలు కురిపిస్తావా అంటూ కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బాలాకోట్ దాడుల విషయంలో భారత సైన్యాన్ని అనుమానించిందని, ఒసామా బిన్ లాడెన్‌ను పొగిడిందని, భారత సైన్యాధిపతిని రోడ్డు మీద గూండా అని వ్యాఖ్యానించిందని, ఇప్పుడు ముషారఫ్‌ను ప్రశంసిస్తోందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మండిపడ్డారు. కార్గిల్ మర్చిపోయారా అంటూ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ విమర్శించారు.

ట్రెండింగ్ వార్తలు