మద్యనిషేధం ఉన్న రాష్ట్రంలో వాటర్ ట్యాంక్ నిండా లిక్కర్ బాటిల్సే..!!

  • Publish Date - February 11, 2020 / 11:49 AM IST

తాగునీటి సరఫరా కోసం ఉపయోగించే ట్యాంకర్ నిండా లిక్కర్ ను తరలించేస్తున్నారు. అదికూడా మద్యనిషేధం అమలులో ఉన్న బీహార్ రాష్ట్రంలో. బీహార్‌లో సంపూర్ణ మద్య నిషేదం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో లిక్కర్ మాఫీయా మద్యాన్ని అక్రమంగా రవాణా చేయటానికి ఇటువంటి కొత్త మార్గాన్ని అవలంభిస్తోంది. దీనిపై సమచారం అందుకున్న పోలీసులు కాపుకాసి లిక్కర్ తరలిస్తున్న వాటర్ ట్యాంకర్ ను అడ్డగించారు. తనిఖీలు చేయగా..వాటర్ ట్యాంకర్‌లో లిక్కర్ బాటిళ్ల కార్టోన్స్‌ను ఉన్నట్లుగా గుర్తించారు. వాటిని వెంటనే స్వాధీనం చేసుకుని ట్యాంకర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన సరన్ జిల్లా పరిధిలో చోటుచేసుకుంది. 

ఈ ట్యాంకర్ లో 330 దేశీ, విదేశీ మద్యం బాటిల్స్ కనిపించాయి. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. ట్యాంకర్ మీద ప్రభుత్వ పథకాలైన ‘స్వచ్ఛ భారత్ అభియాన్’, ‘భేటీ పడావో, భేటీ బచావో’ ప్రకటనలు ఉన్నాయి. బహుశా.. ఆ నినాదాలను చూసి ఆ ట్యాంకర్‌ను పోలీసులు పట్టించుకోరని అనుకుని ఇటువంటి ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది. 

ట్యాంకర్ పై అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీలు చేపట్టగా..స్థానిక ఇంద్ర కాలనీలో నివసిస్తున్న సోను కుమార్ అనే డ్రైవర్ ట్యాంకర్ నిండా త్రాగునీరు ఉందని పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. సోను చెప్పే మాటల్ని బట్టి పోలీసులు అనుమానం మరింతగా బలపడింది. దీంతో పోలీసు అధికారులు ట్యాంకర్ కు ఉండే ట్యాప్ ను పదేపదే తిప్పారు. అయినా వాటర్ రాలేదు. వారి అనుమానం మరింతగా పెరిగి..ట్యాంకర్ డోర్ ను ఓపెన్ చేసి చూడగా లోపల తనిఖీ చేయగా అసలు విషయం బైటపడింది. దీంతో డ్రవర్ సోను కుమార్, క్లీనర్ కునాల్ కుమార్ సింగ్ అరెస్ట్ చేశారు.

అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా..సరన్, సివాన్ జిల్లాల్లోని అక్రమ మద్యం వ్యాపారం చేసే వ్యక్తికి సరుకును తరలిస్తున్నామని తెలిపారు. రాబోయే హోలీ వేడుకల కోసం మద్యం సరఫరా చేయడమే ఈ సరుకు తరలిస్తున్నారనీ సరన్ ఎస్పీ హర్ కిషోర్ రాయ్ తెలిపారు.