×
Ad

Modern Clothes Advice to Yogi: కాషాయం విప్పి కాస్త మోడ్రన్ బట్టలు వేసుకోండి.. యోగీకి కాంగ్రెస్ నేత సూచన

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‭ ద్వారా విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించడం, ఉత్తరప్రదేశ్‌ను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్న సీఎం యోగి.. తన మంత్రులు, అధికారుల బృందం ద్వారా రాష్ట్రంలోని వివిధ రంగాలలో ఉన్న అవకాశాలను వారికి పరిచయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా విదేశాలలో సైతం రోడ్‌షోలను చేయడానికి ప్రణాళిక వేస్తున్నారు

Wear modern clothes instead of saffron: Congress leader to UP CM

Modern Clothes Advice to Yogi: హిందుత్వానికి పోస్టర్ బాయ్‭లా కనిపించే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‭కి కాంగ్రెస్ సీనియర్ నేత విచిత్రమైన సలహా ఇచ్చారు. కాషాయం దుస్తులు కాకుండా కాస్త మోడ్రన్ బట్టలు ధరించాలని యోగికి హుస్సేన్ దల్వాయ్ సూచించారు. మహారాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిని పరిశీలించడానికి యోగి ముంబైకి వచ్చిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యాపారం చేయాలంటే చాలా ఆధునికంగా ఉండాలని, అందువల్ల యోగి ఇక నుంచి మతం గురించి మాట్లాడటం కానీ కాషాయ బట్టలు వేసుకోవడం కానీ చేయకూడదని సూచించారు. ఆధునికమైన బట్టలు ధరించి ఆధునిక ఆలోచనలను స్వీకరించాలని దల్వాయ్ అన్నారు.

Iran: ఎట్టకేలకు నిరసనకు తలొగ్గిన ఇరాన్ ప్రభుత్వం.. జైలు నుంచి విడుదలైన ఆస్కార్ విన్నింగ్ మూవీ నటి అలిదూస్తి

వచ్చే నెలలో లక్నోలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో దేశీయ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ముంబైకి రెండు రోజుల పర్యటనకు యోగి వచ్చారు. అయితే మహారాష్ట్ర నుంచి పరిశ్రమల్ని తీసుకెళ్లకుండా అక్కడే కొత్త పరిశ్రమల్ని ఏర్పాటు చేసుకోవాలని యోగికి దల్వాయ్ సూచించారు. ‘పరిశ్రమలకు మహారాష్ట్ర మంచి సౌకర్యాలు కల్పించింది. కాబట్టి మహారాష్ట్ర నుంచి పరిశ్రమలను తీసుకోకుండా రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను అభివృద్ధి చేసుకోవాలి. అవి అభివృద్ధి చెందేలా వాతావరణాన్ని కల్పించాలి’ అని దల్వాయ్ బుధవారం విలేకరులతో అన్నారు.

Maharashtra: ఉద్ధవ్‭కు కౌంటర్ ఇవ్వడం కోసం బీజేపీ వ్యతిరేకితో చేతులు కలిపిన షిండే

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‭ ద్వారా విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించడం, ఉత్తరప్రదేశ్‌ను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్న సీఎం యోగి.. తన మంత్రులు, అధికారుల బృందం ద్వారా రాష్ట్రంలోని వివిధ రంగాలలో ఉన్న అవకాశాలను వారికి పరిచయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా విదేశాలలో సైతం రోడ్‌షోలను చేయడానికి ప్రణాళిక వేస్తున్నారు. ఇక దేశీయ పెట్టుబడులను తీసుకురావడానికి స్వయంగా యోగియే రంగంలోకి దిగి, పారిశ్రామిక నగరాలు తిరుగుతున్నారు.