Iran: ఎట్టకేలకు నిరసనకు తలొగ్గిన ఇరాన్ ప్రభుత్వం.. జైలు నుంచి విడుదలైన ఆస్కార్ విన్నింగ్ మూవీ నటి అలిదూస్తి

హిజాబ్ వ్యతిరేక నిరసనకు తాను మద్దతు ఇస్తున్నట్లు డిసెంబర్ 8న సోషల్ మీడియా ద్వారా అలిదూస్తి వెల్లడించింది. అదే రోజు షేకారి అనే యువకుడిని ఇరాన్ బహిరంగంగా ఉరి తీయడంపై ఆమె తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ‘‘మనం మౌనంగా ఉండడం అంటే అణచివేతకు అణచివేతదారులకు మద్దతు ఇవ్వడమే. ఇలాంటి రక్తపాతాన్ని చూసి ఎలాంటి చర్యలు తీసుకోని అంతర్జాతీయ సంస్థలు ఉండడం అవమానకరం’’ అని పోస్ట్ చేశారు. అనంతరం ఆమె ఇన్‭స్టా అకౌంట్ రద్దైంది.

Iran: ఎట్టకేలకు నిరసనకు తలొగ్గిన ఇరాన్ ప్రభుత్వం.. జైలు నుంచి విడుదలైన ఆస్కార్ విన్నింగ్ మూవీ నటి అలిదూస్తి

Iran releases Oscar winning actress Taraneh Alidoosti from jail

Iran: హిజాబ్ వ్యతిరేకత నిరసనలో పాల్గొన్న కారణంతో ఆస్కార్ బహుమతి గెలుచుకున్న ‘ద సేల్స్‭మ్యాన్’ అనే మూవీలో నటించిన తరనేహ్ అలిదూస్తి (38) అనే నటిని ఇరాన్ మూకలు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఉన్న వివాదానికి సరిపోను ఈ విషయమై ప్రభుత్వంపై మరిన్ని విమర్శలు రావడంతో ఎట్టకేలకు తలొగ్గక తప్పలేదు. ఆమెను అరెస్ట్ చేసిన 18 తర్వాత బుధవారం విడుదల చేశారు. ఆమెకు బెయిల్ లభించడంతో విడుదలైనట్లు ఇరాన్‭కు చెందిన ఒక వార్తా సంస్థ పేర్కొంది. అయితే ఆమె విడుదలను ఆమె తల్లి నడేరే హకిమేలాని రెండు రోజుల క్రితమే తన ఇన్‭గ్రామ్ ద్వారా వెల్లడించారు.

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న అచ్చం రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి

బుధవారం టెహ్రాన్‌లోని ఎవిన్ జైలు నుంచి ఆమె విడుదలవ్వగానే జైలు ముందే స్నేహితులు ఆమెకు పూల గుత్తులతో స్వాగతం పలికారు. అయితే ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రాలేదు. దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న హిజాబ్ నిరసనలకు మద్దతు తెలిపడంతో పాటు అధికారుల హింసాత్మక నిర్బంధాన్ని విమర్శించినందుకు గాను అలీదూస్తీ సహా పలువురు ఇరాన్ ప్రముఖులు అరెస్ట్ అయ్యారు. హిజాబ్ వ్యతిరేక నిరసనకు తాను మద్దతు ఇస్తున్నట్లు డిసెంబర్ 8న సోషల్ మీడియా ద్వారా అలిదూస్తి వెల్లడించింది. అదే రోజు షేకారి అనే యువకుడిని ఇరాన్ బహిరంగంగా ఉరి తీయడంపై ఆమె తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ‘‘మనం మౌనంగా ఉండడం అంటే అణచివేతకు అణచివేతదారులకు మద్దతు ఇవ్వడమే. ఇలాంటి రక్తపాతాన్ని చూసి ఎలాంటి చర్యలు తీసుకోని అంతర్జాతీయ సంస్థలు ఉండడం అవమానకరం’’ అని పోస్ట్ చేశారు. అనంతరం ఆమె ఇన్‭స్టా అకౌంట్ రద్దైంది.

Uttarakhand: హల్ద్వానీ ఆక్రమణ వ్యవహారంలో ట్విస్ట్.. ఉత్తరాఖండ్ హైకోర్టు ఆర్డర్‭పై సుప్రీంకోర్టు స్టే