West Bengal Couple : గూగుల్ మీట్‌‌లో అతిథులకు ఆహ్వానం.. జొమాటోలో పెళ్లి భోజనం డెలివరీ

పూర్తిగా డిజిటల్ పెళ్లి కాదని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం..కొద్ది మంది మాత్రమే హాజరవుతారని పేర్కొంది. గెస్ట్ లందరికీ ఫుడ్ డెలివరీ చేయడాన్ని జొమాటో ప్రశంసించింది....

Invites Guests On Google Meet : కరోనా ఎంతో మందిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికీ ఈ వైరస్ తగ్గుముఖం పట్టకపోవడంతో ఎన్నో రంగాలకు అతాలకుతలమయ్యాయి. ప్రధానంగా ఈ దిక్కుమాలిన వైరస్ కారణంగా…ఎన్నో పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. జీవితాంతం జ్ఞాపకంగా నిలిచిపోయేలా పెళ్లి చేసుకోవాలని అనుకున్న నూతన వధూవరులకు కరోనా షాక్ ఇచ్చింది. కేవలం కొంతమంది అతిథుల మధ్యనే వివాహం చేసుకోవాల్సి వచ్చింది. పలు శుభకార్యక్రమాల్లో పరిమితంగా బంధువులు, స్నేహితులు హాజరు కావాల్సి ఉంటుందని పలు రాష్ట్రాలు నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఓ వ్యక్తి మాత్రం టెక్నాలజీ వైపు మొగ్గు చూపాడు. తన పెళ్లికి గూగుల్ మీట్ ద్వారా అతిథులను రావాలని కోరాడు.

Read More : Akhanda 50 days Jathara : 50వ రోజు సెకండ్ షోకి బాలయ్య.. నందమూరి హీరోల హంగామా..

వెస్ట్ బెంగాల్ లో నివాసం ఉండే…సందీపన్ సర్కార్ వివాహం అదితి దాస్ తో జరుగనుంది. కరోనా కారణంగా..వివాహ వేడుకలకు కేవలం 50 నుంచి 200 మంది అతిథులు హాజరు కావాల్సి ఉంటుందని ప్రభుత్వం నిబంధన విధించింది. 450 మంది అతిథులకు ఆహ్వానం పలికారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం..తక్కువ సంఖ్యలో అతిథులు హాజరు కావాలని, మిగతా మంది Google Meetలో వేడుకకు హాజరు కావాలని సందీపన్ సూచించారు. సాయంత్రం వారి కోసం జొమాటో ద్వారా ఫుడ్ పంపిణీ చేస్తామన్నారు. గూగుల్ మీట్ ద్వారా వివాహాన్ని వీక్షించే అవకాశం ఉందన్నారు. జనవరి నెలలో తనకు కోవిడ్ రావడంతో ఆసుపత్రిలో చేరడం జరిగందని, ఆ సమయంలో పెళ్లి ఇలా జరుపుకోవాలనే ఆలోచన వచ్చిందన్నారు. అయితే..పూర్తిగా డిజిటల్ పెళ్లి కాదని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం..కొద్ది మంది మాత్రమే హాజరవుతారని పేర్కొంది. గెస్ట్ లందరికీ ఫుడ్ డెలివరీ చేయడాన్ని జొమాటో ప్రశంసించింది.

ట్రెండింగ్ వార్తలు