బెంగాల్ లో బుల్ బుల్ బీభత్సం : నదిపై కూలిన బ్రిడ్జ్

  • Publish Date - November 11, 2019 / 10:52 AM IST

పశ్చిమ బెంగాల్ లో బుల్ బుల్ బీభత్సం సృష్టిస్తోంది. దక్షిణ 24 పరగణాల్లో తుఫాను నామ్ ఖానా ప్రాంతంలో హటానియా దోనియా నదిలపై నిర్మించిన వంతెనలోని రెండు భాగాలు దెబ్బతిని కూలిపోయాయి.  దీంతో రెండు వైపుల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. బుల్ బుల్ తుపాన్ ధాటికి సుందర్ బన్స్ అడవులకు భారీ నష్టం వాటిల్లింది. తుఫాన్ ప్రభావానికి వేగంగా వీస్తున్న గాలులకు చెట్లు కూలిపోయాయి. 

బుల్ బుల్ తుపాన్ ప్రభావానికి ఒడిశా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో ఏడుగురు మృతి చెందారు. జనజీవనం స్థంభించింది. కోల్​కతాలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. అనేక చెట్లు కూలిపోయాయి. హోర్డింగులు ధ్వంసమయ్యాయి. విద్యుత్​ సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు రంగంలోకి దిగాయి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యలు చేపట్టాయి. లోతట్టు తీర ప్రాంతాల నుంచి లక్షా 20వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హౌరాలోని కంట్రోల్‌ రూమ్‌ నుంచి తుఫాన్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి బుల్‌ బుల్‌ తుఫాన్‌ ప్రభావంపై ఆరా తీశారు. ప్రభావిత రాష్ట్రాలను అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.