Jihadi Drug : దేశంలో ఫస్ట్ టైమ్ ‘జిహాదీ డ్రగ్’.. ఏంటిది? దీన్ని తీసుకుంటే ఏమవుతుంది..
jihadi drug : జిహాదీ డ్రగ్‌ను విచ్చలవిడిగా తీసుకోవడం వల్ల వారిలో దీర్ఘకాలంలో సమస్యలు ఏర్పడతాయి. సైకలాజికల్ డిజార్డర్ ఏర్పడుతుంది. దీన్ని కొంచెం తీసుకున్నా కూడా చాలా డేంజరస్. విపరీతమైన కోపం, ఆవేశంగా ప్రవర్తిస్తారు.
- Harish Thanniru
- Published on- May 17, 2026 / 10:46 AM IST
jihadi drug
- దేశంలో ఫస్ట్ టైమ్ ‘జిహాదీ డ్రగ్’
- వీటి విలువ సుమారు రూ.182 కోట్లు ఉంటుందని అంచనా
- గల్ఫ్ దేశాలకు తరిస్తుండగా పట్టుకున్నట్లు అమిత్ షా వెల్లడి
Jihadi Drug : భారత్‌లో మొట్టమొదటిసారి ‘జిహాదీ డ్రగ్’ పట్టుబడింది. దీంతో ఇది సంచలనంగా మారింది. ఆపరేషన్ రేజ్ పిల్‌లో భాగంగా భారత ప్రభుత్వం నిర్వహించిన దాడుల్లో భారీ ఎత్తున ఈ డ్రగ్ పట్టుబడింది. క్యాప్టగాన్‌గా పిలిచే ఈ డ్రగ్‌ను సామాన్య పరిభాషలో ‘జిహాదీ డ్రగ్’గా అభివర్ణిస్తారు. ఇది ఇండియాకు రావాల్సిన ప్యాకేజీ కాదని.. మధ్య ఆసియాకు వెళ్లాల్సిన ప్యాకేజీ ఇండియా మీదుగా వెళ్తుండగా పట్టుబడినట్టు తెలుస్తోంది. వీటి విలువ సుమారు రూ.182 కోట్లు ఉంటుందని అంచనా. గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో ఈ డ్రగ్‌ను పట్టుకున్నారు నార్కోటిక్స్ విభాగం అధికారులు. గల్ఫ్ దేశాలకు తరిస్తుండగా పట్టుకున్నారని, ఒక సిరియన్ దేశస్తుడిని కూడా అరెస్టు చేసినట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు.
ఏంటి ఈ జిహాదీ డ్రగ్?
క్యాప్టగాన్ అని పిలిచే ఈ డ్రగ్‌ను నార్కోటిక్స్ విభాగం జిహాదీ డ్రగ్ గా పిలుస్తుంది. ఎందుకంటే ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఒక రకమైన ఉత్తేజం వస్తుంది. ఎక్కువ సేపు ఆకలి వేయదు. ఫుల్ యాక్టివ్‌గా ఉంచుతుంది. భయం లేకుండా చేస్తుంది. అందుకే దీన్ని చాలా మంది మిలిటెంట్ గ్రూప్స్ వాడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలు తమ నెట్ వర్క్‌లో పనిచేస్తున్న వారికి, వార్‌లో పాల్గొనే వారికి ఇస్తుంటాయి. దీంతో ఉగ్రవాదుల్లో కేర్‌లెస్ నెట్, భయం లేకుండా పోవడం ద్వారా ఇష్టం వచ్చినట్టు అరాచకాలు చేయడానికి ఆస్కారం కలుగుతుంది. సిరియాతో పాటు పలుచోట్ల ఐసిస్ ఉగ్రవాద స్థావరాల్లో ఈ డ్రగ్స్ పెద్ద ఎత్తున లభించాయి.
ఎవరి కోసం కనిపెట్టారు?
వాస్తవానికి దీన్ని జిహాదీ గ్రూప్స్ ఎక్కువగా వాడుతున్నా కూడా దీన్ని కనిపెట్టిన ఉద్దేశం వేరు. 1960ల్లో దీన్ని తొలిసారి అభివృద్ధి చేశారు. మందబుద్ధుల కోసం వారిని యాక్టివ్ గా ఉంచేందుకు దీన్ని తయారు చేశారు. దీనికి మొదట పెట్టిన పేరు ఫెనతీలైన్. కానీ, దీన్ని కొన్నాళ్లు వాడిన తర్వాత దానికి వాళ్లు బానిసలుగా మారడం చూసి చాలా దేశాలు 1980ల్లో ఈ డ్రగ్‌ను బ్యాన్ చేశాయి. కానీ, తర్వాత కాలంలో పలు మార్పులు చేర్పులు చేసి కొత్తగా క్యాప్టగాన్ డ్రగ్ గా దీన్ని అభివృద్ధి చేశారు.
ఈ డ్రగ్స్ వల్ల ఏర్పడే సమస్యలు..
ఈ జిహాదీ డ్రగ్‌ను విచ్చలవిడిగా తీసుకోవడం వల్ల వారిలో దీర్ఘకాలంలో సమస్యలు ఏర్పడతాయి. సైకలాజికల్ డిజార్డర్ ఏర్పడుతుంది. దీన్ని కొంచెం తీసుకున్నా కూడా చాలా డేంజరస్. విపరీతమైన కోపం, ఆవేశంగా ప్రవర్తిస్తారు. మంచి, చెడు ఆలోచించలేని పరిస్థితి ఏర్పడుతుంది.
Also Read : CNG Price Hike : వాహనదారులకు బిగ్ షాకిచ్చిన కేంద్రం.. సీఎన్‌జీ ధరలు మళ్లీ పెరిగాయ్.. ఈసారి భారీగా..
