హక్కులు కాలరాసే పౌరసత్వ చట్టాన్ని రద్దు చేయాలి : హిందువులపై సానుభూతి చూపాల్సిందే 

దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ స్పందించారు. పౌర చట్టం రాజ్యాంగ విరుద్దమని అమర్త్యసేన్

  • Publish Date - January 9, 2020 / 03:29 AM IST

దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ స్పందించారు. పౌర చట్టం రాజ్యాంగ విరుద్దమని అమర్త్యసేన్

దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ స్పందించారు. పౌర చట్టం రాజ్యాంగ విరుద్దమని అమర్త్యసేన్ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బెంగళూరులో ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ అవార్డుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మత ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వడాన్ని తప్పుబట్టారు. 

సీఏఏ పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాస్తుందన్నారు. మతం పేరుతో పౌరసత్వం ఇవ్వాలని రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొనలేదన్నారు. సీఏఏ వల్ల ప్రజల్లో అశాంతి నెలకొంటుదని ఆందోళన వ్యక్తం చేశారు. పౌరసత్వ చట్టాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించాలన్నారు. ఈ చట్టంపై అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో చర్చ జరగాలన్నారు. పౌరసత్వం మతాలకు అతీతంగా ఉండాలన్నారు. అదే సమయంలో పొరుగు దేశాలలో ఉన్న హిందువులపై సానుభూతి తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పౌరసత్వ చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దం అంటూ అమర్త్యసేన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

జేఎన్ యూలో హింస ఘటనపైనా అమర్త్యసేన్ స్పందించారు. ఈ విషయంలో న్యాయం మౌనం వహించిందన్నారు. పోలీసులు ఇప్పటివరకూ నిందితులను పట్టుకోనే లేదన్నారు. బాధితులను ఎఫ్ ఐఆర్ లో నిందితులుగా పేర్కొనడమేంటని ప్రశ్నించారు. జేఎన్ యూలో విద్యార్ధులపై దాడిని ఆయన ఖండించారు.

Also Read : JNU కి వెళ్లిన దీపికా నిజమైన హీరో

ట్రెండింగ్ వార్తలు