Bhagwant Mann : పంజాబ్ సీఎం కు కాబోయే భార్య ఎవరో తెలుసా ?
పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నాయకుడు భగవంత్ మాన్ ఈరోజు వివాహం చేసుకోనున్నారు.
- chvmurthy
- Published On : July 7, 2022 / 07:49 AM IST
Punjab Cm Wife
Bhagwant Mann : పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నాయకుడు భగవంత్ మాన్ ఈరోజు వివాహం చేసుకోనున్నారు. ఆయనకు ఇది రెండో వివాహం. ఆరేళ్ల క్రితం మొదటి భార్యకు విడాకులు ఇవ్వటంతో ఆయన ఈరోజు రెండో వివాహాం చేసుకుంటున్నారు. కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో చండీగఢ్ లో ఈరోజు ఆయన వివాహం జరుగుతుంది.
ఇప్పుడు సీఎం పెళ్లి చేసుకోబోయే మహిళ ఎవరా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గురుప్రీత్ కౌర్ (32) అనే డాక్టర్ ను ఆయన పెళ్లి చేసుకుంటున్నారు. గురుప్రీత్ కౌర్ కురుక్షేత్రలోని ఓ సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి వ్యవసాయం చేస్తారు. తల్లి గృహిణి. ఆమె ఇద్దరు సోదరిలు విదేశాల్లో ఉంటున్నారు.
కొన్నేళ్లుగా మాన్, గురుప్రీత్ కౌర్ కుటుంబాలు సన్నిహితంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. గురుప్రీత్ కౌర్ చదవులో ఎప్పుడూ ముందుండేవారుట. ముల్లానా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివిని కౌర్ గోల్డ్ మెడలిస్ట్. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆమె భగవంత్ మాన్ కు ఎంతో సహాయం చేసినట్లు తెలుస్తోంది.
Also Read : Google: అంకుర సంస్థలు ప్రారంభించాలనుకుంటోన్న వారికి గూగుల్ గుడ్‌న్యూస్
